Motorola Edge 40: అదరగొట్టే ఫీచర్లతో వస్తున్న మోటో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్.!
మోటోరోలా తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలను వెల్లడించింది
Motorola Edge 40 యొక్క కీలకమైన స్పెక్స్ తో కంపెనీ టీజింగ్ కూడా అందించింది
మోటోరోలా ఎడ్జ్ 40 ఆకట్టుకునే కొత్త డిజైన్ తో పాటుగా ఫీచర్లతో కనిపిస్తోంది
మోటోరోలా తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలను వెల్లడించింది. మోటో Edge సిరీస్ నుండి వస్తున్నా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లతో టీజర్ ను కూడా లాంచ్ చేసింది. అదే, Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ తో కంపెనీ టీజింగ్ కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే కొత్త డిజైన్ తో పాటుగా ఫీచర్లతో కనిపిస్తోంది. ఈ ఫోన్ గురించి కంపెనీ వెల్లడించిన కీ స్పెక్స్ మరియు డిజైన్ వివరాలతో ఈ ఫోన్ ఎలా ఉండబోతోందో ఒక లుక్కేద్దాం పదండి.
Motorola Edge 40: టీజ్డ్ స్పెక్స్
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ విడుదల చేసింది మరియు ఈ స్పెక్స్ మరియు ఫీచర్స్ తో ఫోన్ పైన అంచనాలను కూడా మరింతగా పెంచింది. ఫ్లిప్ కార్ట్ మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది మరియు ఈ పేజ్ ద్వారా ఈ స్పెక్స్ వివరాలను అందించింది.
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను సెగ్మెంట్ ఫస్ట్ 144Hz రిఫ్రెష్ రేట్ 3D Curved డిస్ప్లే తో ఈ ఫోన్ ను తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ ప్రమియం లెదర్ మరియు అట్రాక్టివ్ డిజన్ తో కనిపిస్తోంది. ఎడ్జ్ 40 ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 50MP+13MP అల్ట్రా వైడ్/మ్యాక్రో డ్యూయల్ కెమేరా సెటప్ ను కలిగి వుంది. ఈ మోటో ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమేరా కొద వుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8020 ప్రోసెసర్ తో కలిగిన వరల్డ్స్ ఫస్ట్ ఫోన్ అవుతుందని కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ లో 8GB LPDDR4X ర్యామ్ మరియు 256 GB (UFS 3.1) స్టోరేజ్ లను కూడా జత చేసినట్లు మోటో టీజింగ్ ద్వారా సూచించింది. ఈ ఫోన్ 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4400 mAh బ్యాటరీతో వస్తుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్, IP68 రేటింగ్ (వాటర్ ప్రూఫ్) వంటి మరిన్ని ఫీచర్లను కూడా కలిగి వుంది.
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ మే 23న ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.