digit zero1 awards

144Hz Curved డిస్ప్లేతో వస్తున్న Motorola అప్ కమింగ్ 5G Phone.!

144Hz Curved డిస్ప్లేతో వస్తున్న Motorola అప్ కమింగ్ 5G Phone.!
HIGHLIGHTS

మోటోరోలా ఇండియాలో శరవేగంగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది.

144Hz Curved Display తో Motorola అప్ కమింగ్ 5G Phone గా Motorola Edge 40 neo లాంచ్

Motorola Edge 40 neo ప్రపంచంలో అత్యంత తేలికైన IP68 రేటెడ్ 5G Phone

మోటోరోలా ఇండియాలో శరవేగంగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 21న ఇండియన్ మార్కెట్ లో 144Hz Curved Display తో Motorola అప్ కమింగ్ 5G Phone గా Motorola Edge 40 neo ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మోటోరోలా Up Coming స్మార్ట్ ఫోన్ టీజింగ్ ను మొదలు పెట్టిన మోటోరోలా, ఈ ఫోన్ టాప్ ఫీచర్స్ మరియు కీలకమైన స్పెక్స్ ను కూడా వెల్లడించింది. మరి మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్  Motorola Edge 40 neo గురించి కంపెనీ వెల్లడించిన ఆ టాప్ ఫీచర్స్ మరియు కీలకమైన స్పెక్స్ పైన ఒక లుక్కేద్దామా.

Motorola Edge 40 neo Specs 

మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ ను The head Turner క్యాప్షన్ తో కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా ఈ ఫోన్ ప్రతి ఒకరిని ఫోన్ వైపే చూసేలా చేస్తుందని మోటోరోలా చెప్పకనే చెబుతోంది. వాస్తవానికి, Edge 40 neo మంచు డిజైన్ టోన్ కనిపిస్తోంది మరియు కొత్త ప్యాంటోన్ క్యూరేటెడ్ కలర్ లతో వస్తుంది. ఈ Edge 40 neo స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ ఫస్ట్ 144Hz 10-Bit Curved Display ఫోన్ గా నిలుస్తుందని కంపెనీ టీజింగ్ చేస్తోంది.

ఈ మోటోరోలా అప్ కమింగ్ ఫోన్ MediaTek Dimensity 7030  చిప్ సెట్ తో లాంచ్ అయ్యే మొదటి ఫోన్ అని కూడా మోటోరోలా గొప్పగా చెబుతోంది. అంతేకాదు, Motorola Edge 40 neo ప్రపంచంలో అత్యంత తేలికైన IP68 రేటెడ్ 5G Phone గా నిలుస్తుందని కూడా మోటోరోలా అనౌన్స్  చేసింది.

ఈ ఫోన్ IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్ తో వస్తుందని, ఈ ఫోన్ 1.5 మీటర్స్ లోతు నీటిలో 30 నిముషాలు ఎటువంటి డ్యామేజ్ కాకుండా తట్టుకొని ఉందగలదని కంపెనీ ప్రకటించింది.

Motorola Edge 40 neo under water 

144Hz 10-Bit Curved Display

ఈ ఎడ్జ్ 40 నియో ఫోన్ 144Hz 10-Bit Curved pOLED Display ని HDR 10+ తో కలిగి ఉంటుంది. ఇందులో అద్భుతమైన కలర్ లను ఆస్వాదించవచ్చని మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ ను 12GB RAM మరియు 256 GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో అందిస్తోంది.

Motorola Edge 40 neo Camera 

Motorola Edge 40 neo స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 68W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకు వస్తోంది మోటోరోలా. ఈ ఫోన్ యొక్క కెమేరా వివరాలను కూడా కంపెనీ బయటపెట్టింది. Edge 40 Neo ఫోన్ లో 50MP OIS (అల్ట్రా నైట్ విజన్ సపోర్ట్) కలిగిన మెయిన్ కెమేరా మరియు జతగా 13MP (అల్ట్రా వైడ్ + మ్యాక్రో + డెప్త్) కెమేరా కలిగిన క్వాడ్ ఫిక్షన్ కెమేరా సిస్టం వుంది.

అంటే, ఈ అప్ కమింగ్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ యొక్క ధర తప్ప మిగిలిన అన్ని వివరాలను కంపెనీ బయటపెట్టింది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo