MOTOROLA Edge 40 Neo: చవక ధరలో Curved 5G Phone లాంచ్ చేసిన మోటోరోలా.!
pOLED Curved Display తో MOTOROLA Edge 40 Neo 5G ఫోన్ లాంచ్
MOTOROLA Edge 40 Neo 5G అన్ని ఫీచర్ లతో పోటీ ధరతో లాంచ్ చేసింది
మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ పైన రూ. 1,000 అధనపు ఎక్స్ చేంజ్ ప్రకటించింది
మోటోరోలా ఈరోజు ఇండియాలో 144 Hz 10-bit pOLED Curved Display తో MOTOROLA Edge 40 Neo 5G ఫోన్ ను చాలా చవక ధరలో లాంచ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే మార్కెట్ లో 25 వేల రూపాయల ధరలో Curved Display ఫోన్స్ అందుబాటులో ఉండగా ఈ ఫోన్ ను ప్రైస్ మరియు ఫీచర్స్ పరంగా గొప్ప పోటీగా ఈ ఫోన్ ను తీసుకొచ్చి నిలబెట్టింది. మోటోరోలా ఈ ఫోన్ ను ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో నడుస్తున్న అన్ని ఫీచర్ లతో పోటీ ధరతో లాంచ్ చేసింది. మోటోరోలా యొక్క ఈ సరికొత్త Curved 5G Phone స్పెక్స్, ఫీచర్స్ తో పాటుగా ధర మరియు ఆఫర్లు కూడా తెలుసుకోండి.
MOTOROLA Edge 40 Neo Price
MOTOROLA Edge 40 Neo స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో కేవలం రూ. 20,999 ధరలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క 12GB RAM మరియు 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 22,999 రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది.
MOTOROLA Edge 40 Neo offers
మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ పైన రూ. 1,000 అధనపు ఎక్స్ చేంజ్ డిస్కౌంట్ ను ప్రకటించింది. అలాగే, ఈ ను పైన 6 నెలల No Cost EMI అఫర్ ను కూడా అందించింది.
Explore a vibrant universe with the sleek #motorolaedge40neo! Ft. IP68 protection, cutting-edge camera tech, & lightning-fast charging. Sale starts 28th Sept.,7PM starting at special festive pricing Rs 20,999 on @flipkart, https://t.co/azcEfy2uaW & at top retail stores.
— Motorola India (@motorolaindia) September 21, 2023
MOTOROLA Edge 40 Neo Specs
మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ ను మోటోరోలా 6.55 ఇంచ్ 144Hz 10 Bit pOLED Curved Display తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Premium Vegan Leather Finish తో ఆకర్షణీయంగా కనిపించేలా డిజైన్ చేసింది మోటోరోలా. ఈ ఫోన్ Mediatek Dimensity 7030 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ప్రోసెసర్ కి జతగా 8 GB / 12 GB RAM మరియు 128 GB / 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ లతో వస్తుంది.
Edge 40 Neo స్మార్ట్ ఫోన్ వెనుక 50MP OIS మెయిన్ కెమేరా మరియు 13MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన క్వాడ్ ఫిక్షన్ కెమేరాతో వస్తుంది. ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమేరా వుంది. ఈ ఫోన్ మెయిన్ కేమెరాతో 4K UHD వీడియోలను 30 fps వద్ద చిత్రీకరించవచ్చు మరియు సెల్ఫీ కెమేరాతో FHD వీడియోలను 60 fps వద్ద చిత్రీకరించవచ్చు.
ఈ మోటో ఫోన్ TurboPower 68W Charger సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీతో వస్తుంది మరియు Android 13 OS పైన పని చేస్తుంది. ఈ ఫోన్ యొక్క మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఈ ఫోన్ IP68 Underwater Protection తో చాలా తేలికగా ఉంటుంది. ఈ ఫీచర్ గురించి కంపెనీ చాలా గొప్పగా చెబుతోంది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ స్టీరియో స్పీకర్లను Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో కలిగి వుంది.