First Sale: Motorola కొత్త ఫోన్ బడ్జెట్ Curved 5G Phone సేల్ ఈరోజు మొదలవుతుంది.!

First Sale: Motorola కొత్త ఫోన్ బడ్జెట్ Curved 5G Phone సేల్ ఈరోజు మొదలవుతుంది.!
HIGHLIGHTS

MOTOROLA Edge 40 Neo 5G మొదటి సేల్ రేపు మొదలవుతుంది

మోటోరోలా లేటెస్ట్ బడ్జెట్ Curved 5G Phone స్మార్ట్ ఫోన్ MOTOROLA Edge 40 Neo 5G

MOTOROLA Edge 40 Neo స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 20,999 ధరలో లాంచ్ అయ్యింది

First Sale: మోటోరోలా లేటెస్ట్ బడ్జెట్ Curved 5G Phone స్మార్ట్ ఫోన్ MOTOROLA Edge 40 Neo 5G మొదటి సేల్ ఈరోజు సాయంత్రం మొదలవుతుంది. మోటోరోలా సరికొత్తగా తీసుకువచ్చిన ఈ కర్వ్డ్ 5G ఫోన్ ను ఆల్రౌండ్ రౌండ్ ఫీచర్ లతో పోటీ ధరలో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ యొక్క ధర, ఆఫర్స్ మరియు పూర్తి వివరాలను తెలుసుకోండి.

మోటోరోలా ఎడ్జ్ 40 నియో ధర

మోటోరోలా ఎడ్జ్ 40 నియో 5జి స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (8GB + 128 GB) కేవలం రూ. 20,999 ధరతో వచ్చింది. అలాగే, ఈ మోటోరోలా ఫోన్ యొక్క హైఎండ్ వేరియంట్ (12GB + 256GB) ను రూ. 22,999 రూపాయల ధరతో వచ్చింది.

మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఆఫర్స్

మోటోరోలా ఎడ్జ్ 40 నియో పైన Kotak బ్యాంక్ రూ. 1,000 డిస్కౌంట్ అఫర్ మరియు మోటోరోలా రూ. 1,000 అధనపు ఎక్స్ చేంజ్ అఫర్ ను అందించింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ పైన 6 నెలల No Cost EMI అఫర్ కూడా వుంది.

Also Read: కేవలం రూ. 12,499 ధరకే కొత్త 5G Smartphone లాంచ్ చేసిన Lava.!

MOTOROLA Edge 40 Neo Specs

మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ 6.55 inch పరిమాణం కలిగిన 144Hz రిఫ్రెష్ రేట్ 10-Bit pOLED Curved Display తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మోటోరోలా ప్రీమియం వేగన్ లెథర్ తో మంచి డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ Mediatek వేగవంతమైన లేటెస్ట్ ప్రోసెసర్ Dimensity 7030 తో పని చేస్తుంది మరియు జతగా 12 GB RAM మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి వుంది.

MOTOROLA Edge 40 Neo First Sale
మోటోరోలా ఎడ్జ్ 40 నియో ప్రత్యేకతలు

మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ వెనుక భాగంలో 50MP OIS ప్రధాన కెమేరాకి జతగా 13MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో క్వాడ్ ఫిక్షన్ కెమేరాతో వస్తుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమేరా ఫోన్ ముందు భాగంలో వుంది. ఈ మోటో ఫోన్ కేమెరాతో 4K UHD వీడియోలను 30 fps వద్ద చిత్రీకరించవచ్చు మరియు సెల్ఫీ కెమేరాతో FHD వీడియోలను 60 fps వద్ద పొందవచ్చు.

MOTOROLA Edge 40 Neo First Sale
మోటోరోలా ఎడ్జ్ 40 నియో ప్రత్యేకతలు

ఈ మోటోరోలా ఫోన్ TurboPower 68W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో 5000 mAh బ్యాటరీని కలిగి వుంది. ఈ మోటో ఫోన్ Android 13 OS పైన పని చేస్తుంది మరియు IP68 Underwater Protection తో వచ్చిన తేలిక ఫోన్ గా కొనియాడ బడుతోంద. ఆడియో పరంగా, ఈ మోటోరోలా ఎడ్జ్ 40 నియో లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ను Dolby Atmos సపోర్ట్ తో అందించింది మోటోరోలా.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo