బ్రేకేజ్ లేని షట్టర్ ప్రూఫ్ డిస్ప్లే తో మోటోరోలా Droid టర్బో 2 లాంచ్

Updated on 29-Oct-2015
HIGHLIGHTS

5.4 in 2K డిస్ప్లే దీని మరో ప్రత్యేకత

మోటోరోలా అండ్ verzion కలిసి US లో droid టర్బో 2 మోడల్ ను మంగళవారం రిలీజ్ చేశాయి. ఇది గత సంవత్సరం టర్బో మోడల్ కు అప్ గ్రేడ్ స్మార్ట్ ఫోన్. వరల్డ్ ఫర్స్ట్ షట్టర్ ప్రూఫ్ డిస్ప్లే తో వస్తుంది. అక్టోబర్ 29 న సేల్.

స్పెసిఫికేషన్స్ – 5.4 in డిస్ప్లే, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 810 ప్రొసెసర్, 3gb ర్యామ్, 21MP డ్యూయల్ led ఫ్లాష్ ప్రైమరీ కెమేరా, 5MP led ఫ్లాష్ కెమేరా.

32gb/64gb ఇంబిల్ట్ స్టోరేజ్, 2TB మైక్రో sd కార్డ్ స్లాట్, 3760 mah బ్యాటరీ తో 25W చార్జర్ కూడా ఉంటుంది. ఇది 15 నిముషాలు చార్జింగ్ చేస్తే 13 గంటల బ్యాటరీ బ్యాక్ అప్ ఇస్తుంది.

ఆండ్రాయిడ్ 5.1.1 out ఆఫ్ the box os. మార్ష్ మల్లో ఆండ్రాయిడ్ 6.0 అప్ డేట్ కూడా వస్తుంది అని చెబుతుంది verzion. లాంచ్ ఈవెంట్ లో మోటోరోలా ప్రెసిడెంట్, Rick దీని డిస్ప్లే డెమో కోసం concrete పై డ్రాప్ చేసి చూపించటం జరిగింది.

షట్టర్ షీల్డ్ ను తయారు చేయటానికి మోటోరోలా కు 3 సంవత్సరాలు పట్టింది. రిజిడ్ అల్యూమినియం కోర్, ఫ్లేక్సిబిల్ అమోలేడ్ డిస్ప్లే, ట్విన్ టచ్ లేయర్స్, కవరింగ్ కొరకు ఇన్నర్ అండ్ ఔటర్ లెన్స్ కూడా ఉన్నాయి.

దీనితో పాటు droid Maxx 2 అని మోటో x ప్లే రీ బ్రాండెడ్ మోడల్ కూడా లాంచ్ చేసింది అదే ఈవెంట్ లో. మోటోరోలా droid టర్బో 2 యూరోప్ అండ్ ఆసియా లో మోటో x ఫోర్స్ పేరుతో వస్తుంది అని రిపోర్ట్స్.

Connect On :