Motorola budget stylus phone Motorola Edge 60 Stylus launched
Motorola Edge 60 Stylus: ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్ లో బడ్జెట్ స్టైలస్ పెన్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ లాంచ్ అయ్యింది. మోటోరోలా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ను ఇన్ బిల్ట్ స్టైలస్ పెన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోటోరోలా ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్ ఫోన్ ను AI స్కెచ్ టూ ఇమేజ్ సపోర్ట్ కలిగిన ఇన్ బిల్ట్ స్టైలస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో గొప్ప స్క్రీన్ సపోర్ట్ ను కూడా అందించింది. అదేమిటంటే, ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ ను 6.7 ఇంచ్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు గొప్ప 3000 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫోన్ గొప్ప కలర్స్ మరియు ప్రీమియం వేగాన్ లెథర్ ఫినిష్ కలిగి ఉంటుంది. అంతేకాదు, MIL-810H సర్టిఫికేషన్ తో దృఢంగా, IP68 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP Sony LYT 700C మెయిన్, 13MP అల్ట్రా వైడ్ మరియు 8MP కెమెరా ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా moto AI సపోర్ట్ కలిగిన AI కెమెరా ఫీచర్లు మరియు 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ లేటెస్ట్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ Snapdragon 7s Gen 2 చిప్ సెట్ మరియు జతగా 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 128GB మరియు 256GB స్టోరేజ్ ఆప్షన్ లను కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా ఫోన్ Android 15 OS తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో 68W టర్బో పవర్ వైర్డ్ మరియు 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.
Also Read: Google Pixel 9a Sale: భారీ ఆఫర్ తో పిక్సెల్ 9 సిరీస్ బడ్జెట్ ఫోన్ ఫస్ట్ సేల్.!
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 22,999 ధరతో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ లాంచ్ డేల్స్ కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ పై Axis మరియు IDFCబ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఫోన్ ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ Flipkart నుంచి లభిస్తుంది.