మోటో X Style మరియు మోటో X Play మోడల్స్ లాంచ్ అయ్యాయి

మోటో X Style మరియు మోటో X Play మోడల్స్ లాంచ్ అయ్యాయి
HIGHLIGHTS

ఒకటి మోటో x కు బడ్జెట్ మోడల్, మరొకటి అప్ గ్రేడ్ మోడల్

ఇండియాలో మోటో 3rd gen మోడల్ లాంచ్ చేయగా అదే సమయంలో గ్లోబల్ గా ఇంటర్నషనల్ మోడల్స్ లాంచ్ చేసింది మోటోరోలా . వీటి పేర్లు, "మోటో X స్టైల్", "మోటో X ప్లే". మోటో X ప్లే గతంలో ఇండియాలో లాంచ్ అయిన మోటో X మోడల్ యొక్క బడ్జెట్ వెర్షన్ లా అనిపిస్తుంది. మోటో X స్టైల్, మోటోరోలా nexus 6 మోడల్ కు అప్ గ్రేడ్ డివైజ్ వలె ఉంది. ఈ రెండూ ఇండియాలో లో ఇప్పట్లో దొరకవు. కంపెని వీటిని ఇంటర్నేషనల్ మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

Moto X Play
Downgrade స్పెసిఫికేషన్స్ మరియు లో బిల్డ్ క్వాలిటి తో మోస్ట్ affordable మోటో X మోడల్ ఇది. దీనిలో ఆక్టో కోర్ 615 స్నాప్ డ్రాగన్ SoC, 2gb ర్యామ్, 16/32 GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఆప్షన్స్, 128 gb sd కార్డ్ సపోర్ట్, 5.5 in 1080P రేసల్యుషణ్ IPS కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డిస్ప్లే ఉన్నాయి.

21 కెమేరా LED ఫ్లాష్ రేర్ మరియు 5MP ఫ్రంట్ కెమేరాలు ఉన్నాయి దీనిలో. 5.1.1 ఆండ్రాయిడ్ స్టాక్ వెర్షన్ లాలిపాప్ వెర్షన్ తో వస్తుంది. 3630 mah నాన్ రిమూవబుల్ బ్యాటరీ, డ్యూయల్ నానో సిమ్(optional), 4G కనెక్టివిటి మరియు వాటర్ repellent నానో కోటింగ్ IP52 సర్టిఫైడ్ తో 60 దేశాలలో ఆగస్ట్ నుండి 19,200 రూ లకు సేల్ అవనుంది మోటో X ప్లే ఫోన్. ఇండియాలో కొంచెం లేటు గా రానున్నాయి.

Moto X Style
కొత్తగా మొదట సారిగా రిలీజ్ అయిన ఈ మోడల్ మోటో ప్రస్తుత x మోడల్ కు అసలైన అప్ గ్రేడ్ మోడల్. దీనిలో క్వాల్ కామ్ 808 స్నాప్ డ్రాగన్ SoC, 5.7 in 2560 x 1440 పిక్సెల్స్ QHD(క్వాడ్ HD – నాలుగు రెట్లు HD) డిస్ప్లే, ఫ్రంట్ ఫేసింగ్ స్టీరియో స్పీకర్స్, 3GB ర్యామ్ ఉన్నాయి. మొత్తం మూడు (16/32/64 GB) స్టోరేజ్ వేరియంట్ మోడల్స్ వస్తున్నాయి. అన్నింటికీ సేమ్ ర్యామ్.  

దీనిలో 21MP కెమేరా నేక్సాస్ 6 కూడా ఉంది. కంపెని మాటలు ప్రకారం మోటో X స్టైల్ లోని కెమేరా DxO రేటింగ్ ప్రకారం టాప్ 3 కేమేరాస్ in వరల్డ్ లో ఒకటి అని చెబుతుంది. 128 GB కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. LTE, 3000 mah బ్యాటరీ, టర్బో చార్జింగ్ ఉన్న మోటో X స్టైల్ మోడల్ సెప్టెంబర్ నుండి 26,000 రూ లకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో సేల్ అవనుంది. దీని ఇండియన్ availability పై ఇంకా స్పష్టత లేదు.

 

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo