Motorola Razr 40 Series ఫోన్ల పైన రూ. 20,000 భారీ తగ్గింపు ప్రకటించింది మోటోరోలా. 2023 మధ్యలో ఇండియన్ మార్కెట్ లో విడుదలైన మోటోరోలా ఫోల్డ్ ఫోన్స్ పైన ఈ తగ్గింపును అందించింది. ఈ ఎసిరీస్ న్నుండి మోటోరోలా రేజర్ 40 అల్ట్రా మరియు రేజర్ 40 రెండు ఫోల్డ్ ఫోన్ లను ప్రీమియం ధరతో మార్కెట్ లో విడుదల చేసింది. అయితే, ఇప్పుడు ఈ రెండు స్మార్ట్ ఫోన్ ల పైన కూడా భారీ తగ్గింపును ప్రకటించింది.
మోటోరోలా రేజర్ 40 అల్ట్రా ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో రూ. 89,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పైన ఇప్పుడు రూ. 20,000 రూపాయల భారీ తగ్గింపును ప్రకటించింది. అందుకే, ఈ ఫోన్ ఇప్పుడు రూ. 69,999 రూపాయల ధరకే లభిస్తోంది. అలాగే, రూ. 59,999 ధరతో విడుదల చేయబడిన రేజర్ 40 ఫోన్ పైన రూ. 10,000 తగ్గింపును అందించింది. ఈ తగ్గింపు తరువాత ఈ ఫోన్ రూ. 49,999 రూపాయలకే లిస్ట్ చెయ్యబడింది.
అయితే, మోటోరోలా వెబ్సైట్ నుండి ఈరోజు మోటోరోలా రేజర్ 40 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఈరోజు రూ. 44,999 రూపాయల ధరతో లిస్టింగ్ చేయబడింది. అంటే, ఈ ఫోన్ ను ప్రసుతం రూ. 15,000 రూపాయల్ ధరతో సేల్ అవుతున్నట్లు మనం చూడవచ్చు.
Also Read: Jio New Offer: అధిక లాభాలతో కొత్త ప్లాన్ లాంచ్ చేసిన రిలయన్స్ జియో.!
మోటోరోలా రేజర్ 40 అల్ట్రా ఫోల్డ్ ఫోన్ Snapdragon 8+ Gen 1 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB LPDDR5 RAM తో వేగంగా ఉంటుంది. ఈ ఫోన్ లో 6.9″ FHD+ pOLED ఫోల్డబుల్ AMOLED డిస్ప్లే వుంది. ఇది HDR 10+ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 12MP OIS + 13MP (Ultra-wide + macro) మెయిన్ కెమేరా సెటప్ మరియు 32MP సెల్ఫీ కెమేరా వుంది.
ఈ మోటోరోలా ఫోల్డ్ ఫోన్, Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 30W మరియు 5W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 3800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 3.6 ఇంచ్ pOLED సెండ్ డిస్ప్లే కూడా వుంది. ఇది కూడా HDR10+ సపోర్ట్ కలిగిన AMOLED డిస్ప్లేనే అందించింది.