ఇండియాలో అక్టోబర్ 4 న MOTO Z స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవుతుంది. ఈ విషయం స్వయంగా లెనోవో తెలిపింది. తెలియని వారికి – లెనోవో మోటోరోలా ను కొనటం జరిగింది.
లాంచ్ కు సంబంధించి ప్రెస్ కు invites కు పంపింది లెనోవో. ఫోన్ ప్రైస్ ఇంకా తెలియలేదు. Moto Z జూన్ లో అనౌన్స్ అయ్యింది గ్లోబల్ మార్కెట్ లో.
దీనిలో 5.5 in QHD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 820 SoC, 4GB ర్యామ్, 32GB అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్స్. అసలు highlight ఏంటంటే ఫోన్ modular కాన్సెప్ట్ ఫోన్.
అంటే విడిగా భాగాలను ఫోన్ కు కనెక్ట్ చేసుకొని వాడుకోగలరు. ఫోన్ తో పాటు ఆ విడి భాగాలు కూడా వస్తాయి. వీటిని Moto Mods అంటారు.
Mods అంటే ఫర్ eg: Pico Projector with 10x ఆప్టికల్ జూమ్. అంటే అదనపు ఫంక్షన్స్ ను అందిస్తుంది ఈ కాన్సెప్ట్ ద్వారా. దీనిలో కూడా హెడ్ ఫోన్ జాక్ లేదు. USB టైప్ c పోర్ట్ ద్వారానే ఆడియో వినాలి.