నవంబర్ 13 న భారత్ లో మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ Moto X4 స్మార్ట్ఫోన్ ని విడుదల చేయనున్నారు. అక్టోబర్ 3 న ఈ స్మార్ట్ఫోన్ ని విడుదల చేయాలని మోటరోలా మొదట అనుకుంది , అయితే కొన్ని కారణాల వలన కుదరలేదు .
ఈ నెలలో ఒక రిపోర్ట్ ప్రకారం, ప్రొడక్షన్ లేకపోవడంతో, Moto X4 విడుదల తేదీ మరింత వాయిదా పడింది . సంస్థ ఏ విధమైన కారణాన్ని ధ్రువీకరించలేదు కానీ వచ్చే నెలలో ఫోన్ ప్రారంభించబడుతుందని స్పష్టమవుతుంది. ఈ ప్రకటన ట్విటర్ ద్వారా కంపెనీ తెలియచేసింది .
Moto X4 లో గ్లాస్ బ్యాక్ తో 5.2 ఇంచెస్ ఫుల్ HD IPS LCD डि డిస్ప్లే కలదు ,మరియు ఈ డివైస్ స్నాప్ డ్రాగన్ 630 మొబైల్ ప్లాట్ ఫారం కలదు .
Moto X4 స్మార్ట్ ఫోన్ 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు ,మరియు దీని స్టోరేజ్ ని మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు . Moto X4 డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుంది . 12MP ప్రైమరీ కెమెరా f/2.0 అపార్చర్ అండ్ పేజ్ డిటెక్షన్ ఆటో ఫోకస్ తో వస్తుంది . రెండవది 8MP సెకండరీ కెమెరా వైడ్ యాంగిల్స్ తో వస్తుంది . 16MP సెల్ఫీ కెమెరా f/2.0 అపార్చర్ అండ్ LED ఫ్లాష్ తో వస్తుంది .
Moto X4 కనెక్టివిటీ కోసం Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, GPS అండ్ NFC ఆఫర్ చేస్తుంది . Moto X4 ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ పై పనిచేస్తుంది .ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు . 3000mAh బ్యాటరీ కలదు .