Moto X4 నేడు భారతదేశం లో లాంచ్ అవ్వనుంది . Moto X4 గ్లాస్ బ్యాక్ తో ఒక 5.2-అంగుళాల ఫుల్ HD IPS LCD డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఈ డివైస్ Snapdragon 630 మొబైల్ ప్లాట్ఫారం కలిగి ఉంటుంది.
Moto X4 స్మార్ట్ఫోన్ లో 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అమర్చారు, మరియు దాని స్టోరేజ్ ని మైక్రో SD కార్డు ద్వారా 256GB కు పెంచవచ్చు. ఇతర స్మార్ట్ఫోన్ల మాదిరిగానే, Moto X4 కూడా డ్యూయల్ వెనుక కెమెరా సెటప్ తో వస్తుంది . ఈ డివైస్ 12MP ప్రాధమిక కెమెరాను కలిగి ఉంటుంది, ఇది f / 2.0 ఎపర్చరు మరియు ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్ మరియు రెండవ 8MP సెకండరీ కెమెరా వైడ్-కోన్ లెన్సులతో వస్తుంది.దాని వెనుక కెమెరా డ్యూయల్ – LED ఫ్లాష్ మరియు బోకె మోడ్ కి మద్దతు ఇస్తుంది మరియు 30fps వద్ద 4K వీడియోను రికార్డ్ చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, ఇది f / 2.0 ఎపర్చరు మరియు LED ఫ్లాష్ తో వస్తుంది.
Moto X4 కనెక్టివిటీ కోసం Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, GPS మరియు NFC కానీ 3.5mm ఆడియో జాక్ లేదు. Moto X4 ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ లో నడుస్తుంది, దాని వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఈ స్మార్ట్ఫోన్ 3000mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది టర్బో ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది.