motorola XT1650 అనే మోడల్ నంబర్ కలిగిన ఫోన్ ఒకటి GeekBench లో లిస్టు అయ్యింది. హై లైట్ ఏంటంటే దీనిలో 4GB ర్యామ్ ఉంది.
అంతేకాదు లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 820 SoC కూడా ఉంది. ఇది కొత్త Moto X 2016 అని అంచనా. దీనినే కంపెని moto X3 అని కూడా పిలుస్తుంది.
సింగిల్ కోర్ స్కోర్ లో 2309, మల్టీ కోర్ లో 5344 స్పీడ్ ఇస్తుంది ఫోన్. ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0.1 వెర్షన్ os ఉంది. ఇంతకముందే moto X3 ఇండియన్ ఇంపోర్ట్ డేటా సైట్(Zauba) లో కూడా కనిపించింది.
ఇది ఇలా ఉంటే లెనోవో సీఈఓ exciting moto మోడల్ ను జూన్ 9 న రిలీజ్ చేస్తున్నాట్లు తెలపగా ఇది moto x3 కాదని, ఇది moto G4 మరియు G4 ప్లస్ అని రిపోర్ట్స్.
రీసెంట్ గా బయట పడ్డ ఇమేజెస్ ద్వారా moto G4 లో ఫ్రంట్ సైడ్ ఫిజికల్ బటన్ ఉంటుంది అని తెలుస్తుంది. అంటే అది ఫింగర్ ప్రింట్ స్కానర్ కోసమని అంచనా.