5100 బ్యాటరీ, 4GB రామ్ తో MOTO M సిరిస్ ఫోన్ వస్తుంది: రిపోర్ట్స్

Updated on 04-Nov-2016

మోటోరోలా నుండి ఇప్పటివరకూ E, G లేటెస్ట్ గా Z సిరిస్ లలో స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు M అనే కొత్త సిరిస్ లో కంపెని ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది.

తాజగా TechDroider ద్వారా కొన్ని ఫోటోస్ ఇంటర్నెట్ లో leak అయ్యాయి. ఇవి MOTO M స్మార్ట్ ఫోన్ ఫోటోస్ అని రిపోర్ట్స్. ఫోన్ వెనుక భాగం క్లియర్ గా కనిపిస్తుంది.

ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది వెనుక. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన మోస్ట్ ఫోనుల్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫ్రంట్ లో డిస్ప్లే క్రింద ఉంది.

Theandroidsoul.com సైట్ కూడా ఈ ఫోన్ యొక్క స్పెక్స్ చెబుతుంది. ఇమేజ్ ప్రకారం స్నాప్ డ్రాగన్ 625 ప్రొసెసర్, 5100 mah బ్యాటరీ, 4GB రామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి.

గతంలో రిలీజ్ అయిన స్పెక్స్ లీక్స్ లో అయితే ఫోన్ 16MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కెమెరా అండ్ 5.5 in ఫుల్ HD డిస్ప్లే కలిగి ఉంటుంది అని సమాచారం. ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవనుంది అనేది ఇంకా తెలియలేదు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :