Moto G85: నమ్మశక్యం కాని ధరలో పవర్ ఫుల్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Updated on 10-Jul-2024
HIGHLIGHTS

మోటోరోలా ఈరోజు Moto G85 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

ఈ ఫోన్ ను నమ్మశక్యం కాని ధరలో పవర్ ఫుల్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది

Sony కెమెరా మరియు హెవీ ర్యామ్ తో చవక ధరలో వచ్చింది

Moto G85: మోటోరోలా ఈరోజు మోటో జి 85 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను నమ్మశక్యం కాని ధరలో పవర్ ఫుల్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 3D కర్వ్డ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ చిప్ సెట్, Sony కెమెరా మరియు హెవీ ర్యామ్ తో చవక ధరలో వచ్చింది. మోటోరోలా సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు వివరంగా తెలుసుకుందాం.

Moto G85: Price

మోటో జి 85 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB + 128 వేరియంట్ ను రూ. 17,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క హైఎండ్ వేరియంట్ 12GB + 256 ను రూ. 19,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ జూలై 16 వ తేదీ నుండి Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

ఆఫర్స్:

ఈ ఫోన్ పైన మంచి బ్యాంక్ మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్లను మోటోరోలా అందించింది. Axis బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ ను కొనే యూజర్లకు రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ను అందిస్తుంది. ఈ ఫోన్ పైన రూ. 1,000 ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను కూడా అందించింది.

Also Read: లేటెస్ట్ LG బిగ్ Smart Tv పైన అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్.!

Moto G85: ఫీచర్లు

మోటో జి 85 స్మార్ట్ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.67 ఇంచ్ 3D కర్వుడ్ pOLED డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది మరియు గరిష్టంగా 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. G85 స్మార్ట్ ఫోన్ ను Snapdragon 6s Gen 3 చిప్ సెట్ జతగా 12GB మరియు 256GB హెవీ స్టోరేజ్ తో అందించింది.

Moto G85 Features

ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా పనులు చేయగల డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో OIS సపోర్టెడ్ 50MP Sony – LYTIA 600 కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ / మ్యాక్రో + డెప్త్ కెమెరా వుంది. అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరాతో 30fps వద్ద 4K వీడియోలను షూట్ పొందవచ్చు.

ఈ ఫోన్ లో 33W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ వుంది. ఈ మోటో ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Dolby Atmos మరియు Hi-Res సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP52 రేటింగ్ తో వాటర్ రెపెలెంట్ తో ఉంటుంది మరియు Android 14 OS పై పని చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :