Moto G85 5G Sale: మోటోరోలా పవర్ ఫుల్ బడ్జెట్ 3D కర్వుడ్ ఫోన్ ఫస్ట్ సేల్..!
Moto G85 5G ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది
మోటోరోలా ఈ ఫోన్ ను గత వారంలో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది
20 వేల ఉప బడ్జెట్ కేటగిరిలో గొప్ప ఫీచర్స్ తో ఈ ఫోన్ ను అందించింది
Moto G85 5G Sale: మోటోరోలా ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన పవర్ ఫుల్ బడ్జెట్ 3D కర్వుడ్ ఫోన్ మోటో జి 85 5జి ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది. ఈ ఫోన్ ను గత వారంలో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 20 వేల ఉప బడ్జెట్ కేటగిరిలో గొప్ప ఫీచర్స్ తో ఈ ఫోన్ ను అందించింది. ఈ ఫోన్ విలక్షణమైన కలర్స్ మరియు స్మార్ట్ కనెక్ట్ వంటి ఫీచర్ లతో వచ్చింది.
Moto G85 5G Sale: ధర మరియు ఆఫర్స్
మోటో జి 85 5జి స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ ను రూ. 17,999 ధరతో విడుదల చేసింది. ఇది 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఇక రెండవ వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ. 19,999 గా ప్రకటించింది.
ఈ ఫోన్ ను రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పైన రెండు ఆఫర్లు మోటోరోలా అందించింది. ఈ ఫోన్ ను Axis బ్యాంక్ కార్డ్స్ మరియు EMI ఆఫర్ తో కొనేవారికి రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది. లేదా ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ఆఫర్ తో కొనేవారికి రూ. 1,000 అదనపు తగ్గింపును అందిస్తుంది. ఈ ఆఫర్ లలో ఏదైనా ఒక దానిని మాత్రమే పొందవచ్చు. ఒకేసారి రెండు ఆఫర్లు అందుకునే అవకాశం లేదు.
Also Read: WhatsApp లో కొత్త మెసేజ్ ట్రాన్స్ లేషన్ మరియు బోటమ్ కాలింగ్ ఫీచర్స్ వచ్చాయి.!
Moto G85 5G: ఫీచర్లు
మోటోరోలా ఈ కొత్త ఫోన్ ను ఈ ధర పరిధిలో గొప్ప ఫీచర్లతో అందించింది. ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ 3D కర్వుడ్ pOLED డిస్ప్లే వుంది. ఈ స్క్రీన్ 1600 నిట్స్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ ను పవర్ ఫుల్ బడ్జెట్ ప్రోసెసర్ క్వాల్కమ్ Snapdragon 6s Gen 3 5G తో అందించింది. అంతేకాదు, దీనికి జతగా 12GB ఫిజికల్ ర్యామ్ + 12GB ర్యామ్ బూస్ట్ ఫీచర్ సపోర్ట్ మరియు 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా అందించింది.
కెమెరా పరంగా కూడా ఈ ఫోన్ మంచి సెటప్ ని కలిగి వుంది. ఎందుకంటే, ఈ ఫోన్ 50MP Sony LYTIA 600 మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. ఇది అవ్వడానికి డ్యూయల్ కెమెరా సెటప్ అయినా క్వాడ్ కెమెరా పనులు చేస్తుంది. అంతేకాదు, RAW ఫోటో అవుట్ పుట్, 8X డిజిటల్ జూమ్ మరియు FHD (30fps) వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. అయితే, ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ లేకపోవడం నిరాశపరుస్తుంది. ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది.
ఈ ఫోన్ వేగన్ లెథర్ డిజైన్ తో కోబాల్ట్ బ్లూ, ఆలివ్ గ్రీన్ మరియు అర్బన్ గ్రీన్ మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ వుంది. ఈ మోటో ఫోన్ Dolby Atmos మరియు Hi-Res సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్ లను కలిగి వుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS పైన నడుస్తుంది మరియు స్మార్ట్ కనెక్ట్ తో స్వైప్ టు షేర్ ఫీచర్ తో వస్తుంది.