ఈరోజు ఇండియన్ మార్కెట్ లో ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ Motorola కొత్త స్మార్ట్ ఫోన్ Moto G84 5G ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 120Hz pOLED డిస్ప్లే మరియు 50MP OIS కెమేరాతో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ మరియు ప్రీమియం లెథర్ డిజైన్ తో ఇండియన్ మార్కెట్ కి పరిచయం చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తో పాటుగా ఇదే G సిరీస్ నుండి త్వరలో రాబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Moto G54 5G లాంచ్ డేట్ ను కూడా ప్రకటించింది. మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Moto G84 స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు టాప్ ఫీచర్లు తెలుసుకోండి.
మోటోరోలా ఈ Moto G84 స్మార్ట్ ఫోన్ ను కేవలం 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో సింగిల్ వేరియంట్ ను మాత్రమే విడుదల చేసింది. Moto G84 Price ను రూ. 19,999 గా ప్రకటించింది మరియు సెప్టెంబర్ 8వ తేదీ నుండి Flipkart ద్వారా సేల్ ఈ ఫోన్ మొదలవుతుంది.
మోటో జి84 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ అఫర్ లో భాగంగా రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది.
ఇక ఈ మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్స్ గురించి చూస్తే ఈ ఫోన్ లో 5 ఫీచర్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందుకే, ఈ 5 టాప్ ఫీచర్స్ గురించి వివరంగా అందించాను.
మోటోరోలా మోటో జి 84 5జి స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ 10-bit pOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1300 nits పీక్ బ్రైట్నెస్ తో మోటోరోలా అందించింది. ఈ డిస్ప్లే అద్భుతమైన కలర్స్ అందించ గల సత్తాకలిగిన డిస్ప్లే గా కంపెనీ చెబుతోంది మరియు ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కూడా వస్తుంది.
ఈ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క బడ్జెట్ ఫాస్ట్ ప్రోసెసర్ గా చెప్పబడే SNAPDRAGON 695 5G ప్రోసెసర్ తో అందించింది.
ఈ స్మార్ట్ ఫోన్ SD 695 ప్రోసెసర్ కి జతగా 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుందని మోటోరోలా గొప్పగా చెబుతోంది.
Motorola ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP OIS మెయిన్ కెమేరా మరియు 8MP సెకండరీ కెమేరాతో అందించింది. ఈ కెమేరా సిస్టమ్ FHD వీడియోలను 60fps వరకూ మాత్రమే రికార్డ్ చేయగలదు. ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమేరా అనేక ఫిల్టర్స్ తో కలిగివుంది.
ఈ మోటో ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.
https://twitter.com/motorolaindia/status/1697510135743336814?ref_src=twsrc%5Etfw