మోటోరోలా ఇండియాలో లాంచ్ చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను వెల్లడించింది. సెప్టెంబర్ 1వ తేదిన Moto G84 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ కి పరిచయం చేయబోతున్నట్లు మోటోరోలా డేట్ అనౌన్స్ చేసింది. ఈ Moto G84 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటుగా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా టీజర్ ద్వారా కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది మరియు ఈ పేజ్ ద్వారా వివరాలను తెలుపుతూ టీజింగ్ చేస్తోంది.
ఈ ఫోన్ కోసం మోటోరోలా అందించిన టీజర్ ద్వారా ఈ ఫోన్ ను సెగ్మెంట్ టాప్ ఫీచర్ లతో మార్కెట్ లో లాంచ్ చెయ్యడానికి మోటోరోలా చూస్తున్నట్లు అర్ధమవుతోంది.
G84 5G స్మార్ట్ ఫోన్ ను మూడు అందమైన కలర్ లలో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఇందులో, Viva Magenta ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఫోన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.55 ఇంచ్ 10bit pOLED డిస్ప్లేతో లాంచ్ చేస్తోంది మోటోరోలా. ఈ డిస్ప్లే 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR 10+ సపోర్ట్ ను కలిగి వుంది. అంటే, ఈ డిస్ప్లే లో మీరు అధిక కలర్స్ ను చూడవచ్చు మరియు కంటెంట్ తో పాటు గేమింగ్ కూడా అనువైన డిస్ప్లే.
ఈ ఫోన్ ను Sanapdragon 695 5G ప్రోసెసర్ కి జతగా బిగ్ 12GB ర్యామ్ మరియు 256GB హెవీ స్టోరేజ్ తో లాంచ్ చేయబోతున్నట్లు టీజర్ ద్వారా తెలిపింది. ఈ ప్రోసెసర్ బడ్జెట్ 5G ప్రోసెసర్ గా మంచి పేరుతెచ్చుకుంది. దీనికి 12GB ర్యామ్ తొడయ్యిందంటే ఫోన్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అయితే, ఫోన్ లాంచ్ అయిన తరువాత రివ్యూ లో ఈ విషయం గురించి వివరిస్తాను.
ఈ ఫోన్ లో ఉన్న కెమేరా వివరాలను కూడా మోటోరోలా వెల్లడించింది. ఈ ఫోన్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమేరా + 8MP అల్ట్రా వైడ్ కెమేరా + 8MP మ్యాక్రో/ డెప్త్ కెమెరాలతో కూడిన క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమేరా వుంది. ఈ ఫోన్ లో ప్రస్తుతం ట్రెండ్ గా నడుస్తున్న 5000mAh బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించినట్లు చూపిస్తోంది.
అలాగే, ఈ ఫోన్ లో మంచి క్వాలిటీ సౌండ్ ని అందించడం కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లను Dolby Atmos మరియు Spatial Sound సపోర్ట్ లతో అందిస్తున్నట్లు మోటోరోలా టీజర్ పేజ్ ద్వారా గొప్ప ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది.