Moto G84 5G: 50MP OIS కెమేరా సహా ఈ టాప్ ఫీచర్లతో రేపు లాంచ్ అవుతోంది.!

Moto G84 5G: 50MP OIS కెమేరా సహా ఈ టాప్ ఫీచర్లతో రేపు లాంచ్ అవుతోంది.!
HIGHLIGHTS

Moto G84 5G ఫోన్ లాంచ్ కోసం డేట్ ఫిక్స్ చేసింది

మోటోరోలా యొక్క అప్ కమింగ్ 5G స్మార్ట్ ఫోన్ Moto G84 5G

50MP OIS కెమేరా సహా ఈ టాప్ ఫీచర్లతో రేపు లాంచ్ అవుతోంది

Moto G84 5G: మోటోరోలా ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ కోసం డేట్ ఫిక్స్ చేసింది. అదే, మోటోరోలా యొక్క అప్ కమింగ్ 5G స్మార్ట్ ఫోన్ Moto G84 5G మరియు ఈ ఫోన్ ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 50MP OIS కెమేరా సహా ఈ టాప్ ఫీచర్లతో రేపు లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ముఖ్యమైన స్పెక్స్ మరియు కీలకమైన ఫీచర్స్ గురించి కూడా వివరాలను వెల్లడించింది. ఇందులో ఈ ఫోన్ లాంచ్ కోసం Flipkart ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ అందించింది మరియు ఈ పేజ్ నుండి టీజర్ వివరాలను కూడా వెల్లడించింది. Motorola అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మోటో జి84 5G టీజ్డ్ ఫీచర్స్ మరియు స్పెక్స్ పైన ఒక లుక్కేయండి. 

Moto G84 5G: టీజ్డ్ స్పెక్స్ & ఫీచర్స్ 

Moto G84 5G స్మార్ట్ ఫోన్ ను యూజర్ల ప్రస్తుత అవసరాలను అలవాట్లను దృష్టిలో ఉంచుకొని 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 10-bit pOLED డిస్ప్లేతో లాంచ్ చేస్తోంది. ఈ డిస్ప్లే మంచి రంగుల్లో మరియు క్లారిటీతో HD కంటెంట్ చూడటానికి మరియు గొప్ప రిఫ్రెష్ రేట్ తో మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కు సహాయ పడుతుంది. ఈ ఫోన్ ను అందమైన కలర్స్ మరియు ప్రీమియం వేగన్ లెథర్ తో మోటోరోలా లాంచ్ చేస్తోంది.

ఈ ఫోన్ ను Snapdragon 695 5G ప్రోసెసర్ మరియు జతగా 12GB వరకూ RAM సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో ఈ ఫోన్ లో 256GB వరకూ హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా మోటోరోలా అఫర్ చేస్తోంది. ఈ ఫోన్ లో 50MP OIS మెయిన్ కెమేరాని అందించింది మరియు గొప్ప ఫోటోలను తియ్యగలదని కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ ఫోన్ కెమేరా కంటెంట్ చూడటానికి తగిన డిస్ప్లేకి జతగా బెస్ట్ సౌండ్ సపోర్ట్ ను కూడా అందించింది.

 Moto G84 5G display

మోటో జి84 5జి స్మార్ట్ ఫోన్ Dolby Atmos సపోర్ట్ మరియు మోటో స్పెటియల్ ఆడియో టెక్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. అంటే, ఈ ఫోన్ లో మంచి సౌండ్ మరియు క్వాలిటీతో OTT లేదా ఇతర ప్లాట్ ఫామ్స్ పైన కంటెంట్ ను ఆనందించవచ్చు. ఈ ఫోన్ ను వేగవంతమైన 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బిగ్ బిగ్ బ్యాటరీతో కూడా అందిస్తోంది మోటోరోలా.

 

 

Moto G84 5G ఫోన్ లాంచ్ తరువాత ఈ ఫోన్ యొక్క పూర్తి రివ్యూ ని అందించ గలుగుతాము. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo