మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Moto G73 5G రేపు ఇండియాలో విడుదల కానుంది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఇప్పుడు ఆన్లైన్లో లీకయ్యాయి. ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ Moto G73 5G స్మార్ట్ ఫోన్ యొక్క లీక్డ్ వివరాలను తన ట్విటర్ అకౌంట్ నుండి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్ పైన ఫోన్ రిలీజ్, సేల్, ధర మరియు స్పెక్స్ వివరాలు పూర్తిగా చూపించబడ్డాయి. మరి ఈ ట్వీట్ ఏమి చెబుతోంది మరియు ఈ ఫోన్ వివరాల పైన ఒక లుక్కేద్దామా.
అభిషేక్ యాదవ్ ట్వీట్ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అఫర్ లో భాగంగా రూ.16,999 రూపాయలుగా తెలుస్తోంది. అయితే, ఫోన్ MRP రేటు మాత్రం రూ.18,999 రూపాయలుగా చూపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ మార్చి 16వ తేదీ నుండి మొదలవుతుందని, Flipkart మరియు ప్రముఖ రిటైల్ స్టోర్స్ నుండి కూడా లభిస్తుందని ట్వీట్ చెబుతోంది.
https://twitter.com/yabhishekhd/status/1633061947955347457?ref_src=twsrc%5Etfw
Moto G73 5G స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ FHD IPS LCD డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు ఫోన్ 8.29. మందతో ఉంటుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 930 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. అయితే, ఫోన్ ర్యామ్ మరియు స్టోరేజ్ వివరాలను మాత్రం ఈ లీక్ వెల్లడించలేదు.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP+8MP రియర్ కెమెరాతో వుంది. ముందు పంచ్ హోల్ లో 16MP సెల్ఫీ కెమెరాని ఉన్నట్లు తెలిపింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఇది ఆండ్రాయిడ్ 13 OS, BT 5.2, 4x4MIMO మరియు 13 ఇండియన్ 5G బ్యాండ్స్ కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని కూడా వివరిస్తోంది. అంతేకాదు ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నట్లు కూడా వివరాలు బయటికొచ్చాయి//.