Moto G73 5G: విడుదలకు ముందే లీకైన ఫోన్ ధర మరియు స్పెక్స్ వివరాలు.!
Moto G73 5G రేపు ఇండియాలో విడుదల కానుంది
ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఇప్పుడు ఆన్లైన్లో లీకయ్యాయి
Moto G73 5G ఫోన్ వివరాల పైన ఒక లుక్కేద్దామా
మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Moto G73 5G రేపు ఇండియాలో విడుదల కానుంది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఇప్పుడు ఆన్లైన్లో లీకయ్యాయి. ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ Moto G73 5G స్మార్ట్ ఫోన్ యొక్క లీక్డ్ వివరాలను తన ట్విటర్ అకౌంట్ నుండి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్ పైన ఫోన్ రిలీజ్, సేల్, ధర మరియు స్పెక్స్ వివరాలు పూర్తిగా చూపించబడ్డాయి. మరి ఈ ట్వీట్ ఏమి చెబుతోంది మరియు ఈ ఫోన్ వివరాల పైన ఒక లుక్కేద్దామా.
అభిషేక్ యాదవ్ ట్వీట్ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అఫర్ లో భాగంగా రూ.16,999 రూపాయలుగా తెలుస్తోంది. అయితే, ఫోన్ MRP రేటు మాత్రం రూ.18,999 రూపాయలుగా చూపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ మార్చి 16వ తేదీ నుండి మొదలవుతుందని, Flipkart మరియు ప్రముఖ రిటైల్ స్టోర్స్ నుండి కూడా లభిస్తుందని ట్వీట్ చెబుతోంది.
Motorola Moto G73 5G India price ₹18,999
6.5" FHD+ IPS LCD display
120Hz refresh rate
MediaTek Dimensity 930
Android 13
5000mAh battery 30 watt
50MP+8MP rear
16MP front
3.5mm jack
Dual speakers
BT 5.2
4×4 MIMO
13 5G bands
IP52
8.29mm thick
181 gram weightOffer price ₹16,999 pic.twitter.com/7VPXLa02uZ
— Abhishek Yadav (@yabhishekhd) March 7, 2023
Moto G73 5G: లీక్డ్ &అంచనా స్పెక్స్
Moto G73 5G స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ FHD IPS LCD డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు ఫోన్ 8.29. మందతో ఉంటుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 930 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. అయితే, ఫోన్ ర్యామ్ మరియు స్టోరేజ్ వివరాలను మాత్రం ఈ లీక్ వెల్లడించలేదు.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP+8MP రియర్ కెమెరాతో వుంది. ముందు పంచ్ హోల్ లో 16MP సెల్ఫీ కెమెరాని ఉన్నట్లు తెలిపింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఇది ఆండ్రాయిడ్ 13 OS, BT 5.2, 4x4MIMO మరియు 13 ఇండియన్ 5G బ్యాండ్స్ కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని కూడా వివరిస్తోంది. అంతేకాదు ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నట్లు కూడా వివరాలు బయటికొచ్చాయి//.