Moto G64 5G: స్లీక్ డిజైన్, సూపర్ ఫీచర్స్ తో వస్తోంది.!
మోటరోలా ఈ సిరీస్ నుంచి జి64 5జి ని కూడా లాంచ్ చేస్తోంది
మోటో జి64 5G స్మార్ట్ ఫోన్ లాంఛ్ డేట్ ను అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ లో 50MP షేక్ ఫ్రీ కెమేరా సిస్టం ఉన్నట్లు తెలిపింది
Moto G64 5G: మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మోటో జి64 5G స్మార్ట్ ఫోన్ లాంఛ్ డేట్ ను అనౌన్స్ చేసింది. మోటోరోలా యొక్క బడ్జెట్ సిరీస్ జి సిరీస్ నుంచి ఇప్పటికే చాలా స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చిన మోటరోలా ఈ సిరీస్ నుంచి జి64 5జి ని కూడా లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పటివరకు ఏ ఫోన్ కలిగిలేని మీడియా టెక్ కొత్త ప్రాసెసర్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది.
Moto G64 5G ఎప్పుడు లాంఛ్ అవుతోంది?
మోటో g64 5g స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. మోటరోలా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఇప్పటికే టీజింగ్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. ఈ ఫోన్ Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అందుకే ఫ్లిప్ కార్ట్ ఈ ఫోను ప్రత్యేకమైన మైక్రో సెట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది.
Moto G64 5G: టీజింగ్ స్పెక్స్
మోటో g6450 స్మార్ట్ ఫోన్ యొక్క టీజింగ్ స్పెక్స్ ను కంపెనీ అందించింది. అప్కమింగ్ మోటో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7025 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తోంది. అంతేకాదు, ఈ ప్రోసెసర్ తో వస్తున్న మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఈ ఫోన్ లో 12GB RAM మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటాయి.
ఈ స్పెక్స్ ను వెల్లడించి ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ పైన అంచనాలను పెంచింది. ఇకపోతే ఈ ఫోన్ లో 50MP షేక్ ఫ్రీ కెమేరా సిస్టం ఉన్నట్లు తెలిపింది. ఈ ఫోన్ 8MP మ్యాక్రో/ డెప్త్ కెమేరా మరియు 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.
Also Read: Gold Rate Hiked: ఈరోజు దారుణంగా పెరిగిన గోల్డ్ రేట్.!
ఈ ఫోన్ లో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగిన 6.5 ఇంచ్ ఇంచ్ FHD+ రిజల్యూషన డిస్ప్లే ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు సన్నని అంచులను కలిగి ఉంటుంది. మోటోరోలా న్నీ స్మార్ట్ ఫోన్ ల మాదిరిగానే ఈ ఫోన్ లో కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్లను Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగి వుంది.
ఈ మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది. ఓవరాల్ గా ఈ ఫోన్ ను కంప్లీట్ ప్యాకేజ్ ఫోన్ గా మోటోరోలా తీసుకు వస్తున్నట్లు చెబుతోంది.