Moto G62 5G: భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న మోటో లేటెస్ట్ 5G ఫోన్.!
Moto G62 5G ఇప్పుడు Flipkart నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది
ఈ ఫోన్ ప్రస్తుతం రూ.3,000 రూపాయల డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆఫర్లతో లభిస్తోంది
మరి ఈ బెస్ట్ 5G ఫోన్ డీల్ పైన ఒక లుక్కేద్దాం పదండి
మోటోరోలా లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ Moto G62 5G ఇప్పుడు Flipkart నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ 5G సపోర్ట్ మరియు స్టాక్ ఆండ్రాయిడ్ OS వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ప్రస్తుతం Flipkart నుండి రూ.3,000 రూపాయల డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆఫర్లతో లభిస్తోంది. మరి ఈ బెస్ట్ 5G ఫోన్ డీల్ పైన ఒక లుక్కేద్దాం పదండి.
Moto G62 5G: అఫర్ ధర
Moto G62 5G బేసిక్ వేరియంట్ (6GB+128GB) రూ.17,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ప్రస్తుతం 2,000 రూపాయల తగ్గింపుతో Flipkart నుండి రూ.15,999 రూపాయలకే లభిస్తోంది. ఇక హై ఎండ్ వేరియంట్ (8GB+128GB) రూ.19,999 ధరతో లాంచ్ కాగా ఇప్పుడు రూ.16,999 రూపాయలకే లభిస్తోంది. అంటే, ఈ వేరియంట్ పైన 3000 రుపాయల తగ్గింపు మీకు లభిస్తుంది. అంతేకాదు, IDFC Frist, Bank of Baroda, Citi Credit Card మరియు IndusInd Bank బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనే వారికి రూ.1,000 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Moto G62 5G: స్పెక్స్
Moto G32 5G స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ FHD+ Fluid డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు బ్రిలియంట్ కలర్ తో వుంటుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను అందిస్తుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫంక్షన్ రియర్ కెమెరాతో వుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్ అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. చివరిగా 2MP మ్యాక్రో సెన్సార్ కూడా వుంది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది మరియు IP52 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా వున్నాయి.