Moto G62 5G ఫోన్ పైన రూ.3,000 భారీ తగ్గింపు.!

Updated on 14-Mar-2023
HIGHLIGHTS

Moto G62 5G ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ రూ.3,000 భారీ తగ్గింపు అందుకుంది

ఈ భారీ తగ్గింపు తరువాత బడ్జెట్ ధరలోనే లభిస్తోంది

మోటోరోలా ఇటీవల ప్రకటించిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Moto G62 5G ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమేరా, స్టాక్ ఆండ్రాయిడ్, Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ రూ.3,000 భారీ తగ్గింపు అందుకుంది. ఈ భారీ తగ్గింపు తరువాత ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ కేవలం బడ్జెట్ ధరలోనే లభిస్తోంది.

Moto G62 5G: అఫర్ ధర

Moto G62 5G బేసిక్ వేరియంట్ (6GB+128GB) రూ.17,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ 2,000 రూపాయల తగ్గింపుతో రూ.15,999 రూపాయలకే లభిస్తోంది. హై ఎండ్ వేరియంట్ (8GB+128GB) రూ.19,999 ధరతో లాంచ్ కాగా ఇప్పుడు రూ.16,499 రూపాయలకే లభిస్తోంది. అంటే, ఈ వేరియంట్ పైన 3500 రుపాయల తగ్గింపు మీకు లభిస్తుంది.

Moto G62 5G: స్పెక్స్

Moto G32 5G స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ FHD+ Fluid డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు బ్రిలియంట్ కలర్ తో వుంటుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను అందిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫంక్షన్ రియర్ కెమెరాతో వుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్  అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. చివరిగా  2MP మ్యాక్రో సెన్సార్ కూడా వుంది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.

ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది మరియు IP52 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా వున్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :