Moto G54 5G: 12GB RAM హెవీ స్టోరేజ్ తో వచ్చిన సెగ్మెంట్ First Powerful Phone
Moto G54 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు Bharat లో లో విడుదల చేసింది
Moto G54 5G 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో సెగ్మెంట్ First Powerful ఫోన్ గా అవతరించింది
మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి
మోటోరోలా గత కొంత కాలంగా టీజ్ చేస్తున్న Moto G54 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు Bharat లో లో విడుదల చేసింది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో సెగ్మెంట్ First Powerful ఫోన్ గా అవతరించింది. ఈ ఫోన్ కేవలం ఈ కేటగిరిలోనే కాదు మరిన్ని విభాగాల్లో సెగ్మెంట్ ఫాస్ట్ ఫోన్ గా అవతరించింది. మోటోరోలా ముందు నుండి చెబుతున్నట్లు గానే ఈ ఫోన్ ను ధరలో అందించింది. ఈరోజే భారత్ మార్కెట్ లో అడుగుపెట్టిన ఈ మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
Moto G54 5G Price
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. వీటి ధర మరియు వివరాలను క్రింద చూడవచ్చు.
1. Moto G54 5G : (8GB RAM + 128GB) ధర రూ. 15,999
2. Moto G54 5G : (12GB RAM + 256GB) ధర రూ. 18,999
మోటో జి 54 5G స్మార్ట్ ఫోన్ మింట్ గ్రీన్, మిడ్ నైట్ బ్లూ మరియు పెర్ల్ బ్లూ అనే మూడు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart మరియు motorola అధికారిక సైట్ నుండి సేల్ అవుతుంది.
మోటోరోలా ఈ మోటో జి54 5జి స్మార్ట్ ఫోన్ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా జత చేసింది. ఈ ఫోన్ ను ICICI Bank క్రెడిట్ కార్డ్ తో కొనేవారు రూ. 1,500 డిస్కౌంట్ ను పొందుతారు.
Moto G54 5G Specs
Moto G54 5G స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ IPS LCD డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ (2400 x 1080) రిజల్యూషన్ తో కలిగి వుంది. మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను 3D Premium PMMA బాడీతో మరియు IP52 వాటర్ రేపెళ్లేంట్ డిజైన్ తో అందించింది. జి54 స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 7020 ప్రోసెసర్ జతగా 12GB RAM మరియు 256GB హెవీ స్టోరేజ్ లను కూడా కలిగి వుంది.
ఈ మోటోరోలా కొత్త ఫోన్ 50MP (OIS) సెన్సార్ + 8MP అల్ట్రా వైడ్/ డెప్త్ /మ్యాక్రో సెన్సార్ కలిగిన క్వాడ్ ఫిక్షన్ కెమేరాని కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరాతో FHD వీడియోలను 30fps వద్ద చిత్రీకరించవచ్చు. అలాగే, ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ HDR, RAW Photo, Active Photos వంటి టన్నుల కొద్దీ కెమేరా ఫీచర్లతో వస్తుంది.
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ లో Dolby Atmos మరియు Moto Spatial Sound సపోర్ట్ కలిగిం డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా అందించింది. ఈ ఫోన్ లో 6000 mAh హెవీ బ్యాటరీని 33W Turbo Power ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.