Moto G54 5G: 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో వస్తున్న సెగ్మెంట్ ఫస్ట్ ఫోన్ అంట.!
రీసెంట్ గా ఇండియాలో Moto G84 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన మోటోరోలా
మోటోరోలా సెప్టెంబర్ 6వ తేదీ Moto G54 5G ను విడుదల చెయ్యడానికి సిద్దమవుతోంది
ఈ ఫోన్ ను తక్కువ ధరలో 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో లాంచ్ చేస్తోంది
రీసెంట్ గా ఇండియాలో Moto G84 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన మోటోరోలా సెప్టెంబర్ 6వ తేదీ Moto G54 5G ను విడుదల చెయ్యడానికి సిద్దమవుతోంది. Moto G54 5G స్మార్ట్ ఫోన్ 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో వస్తున్న సెగ్మెంట్ ఫస్ట్ ఫోన్ అని కూడా మోటోరోలా ప్రకటించింది. అంటే, ఈ ఫోన్ ను తక్కువ ధరలో 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో తీసుకువస్తున్నట్లు క్లియర్ గా చెబుతోంది. అంతేకాదు, మరో రెండు రోజుల్లో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ తో కూడా టీజింగ్ మొదలు పెట్టింది.
Moto G54 5G specs
మోటోరోలా లాంచ్ చేయబోతున్న ఈ Moto G54 5G స్మార్ట్ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది మరియు ఈ పేజ్ నుండి Moto G54 5G యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను టీజ్ చేస్తోంది.
మోటో టీజర్ ప్రకారం, Moto G54 5G స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ FHD రిజల్యూషన్ డిస్ప్లేతో మరియు 3D Acrylic Glass డిజైన్ తో వస్తుంది. G54 5G ఫోన్ MediaTek Dimensity 7020 బడ్జెట్ 5G ప్రోసెసర్ కి జతగా హెవీ 12GB RAM మరియు హెవీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.
Designed to capture attention, the #motog54_5G exudes sleek elegance. With a range of standout colours, it offers a delightful touch and comfortable grip. Launching 6th Sept. on @flipkart, https://t.co/azcEfy2uaW and at leading retail stores. #GoBeyondSpeed
— Motorola India (@motorolaindia) September 4, 2023
ఈ ఫోన్ ను ఈ సెగ్మెంట్ లో 50MP OIS Camera తో వస్తున్న మొదటి ఫోన్ కూడా ఇదే అని మోటోరోలా గొప్పగా చెబుతోంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా 8MP Macro + Depth Camera కూడా ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ 6000 mAh హెవీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటి చాలా ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అవుతున్నట్లు మోటోరోలా చాలా గొప్పగా చెబుతోంది.
మోటోరోలా చెబుతున్న ప్రకారం ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయితే మాత్రం, ప్రస్తుతం మార్కెట్ లో ఇప్పటికే ఉన్న చాలా 5G ఫోన్ లకు గట్టి పాటుగా నిలిచే అవకాశం వుంది.