సెగ్మెంట్ ఫస్ట్ 12GB RAM ఫోన్ Moto G54 5G First sale..ధర మరియు ఆఫర్స్ ఇవే.!

Updated on 12-Sep-2023
HIGHLIGHTS

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Moto G54 5G First sale డేట్ వచ్చేసింది

Moto G54 5G స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ ఫస్ట్ 12GB RAM ఫోన్ గా ప్రవేశపెట్టబడింది

ఈ ఫోన్ కేవలం రూ. 15,999 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తుంది

మోటోరోలా రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Moto G54 5G First sale డేట్ వచ్చేసింది. ఈ Moto G54 5G స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ ఫస్ట్ 12GB RAM మరియు 256 GB స్టోరేజ్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టబడింది. ఈ మోటోరోలా బడ్జెట్ 12GB RAM స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 13వ తేదీ సేల్ కి అంధుబాటులోకి వస్తుంది. సేల్ కంటే ముందుగా ఈ G54 5G ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఆఫర్స్ వివరంగా తెలుసుకోండి. ఎందుకంటే, ఈ బడ్జెట్ ధరలో ఈ ఫోన్ స్పెక్స్ షీట్ ప్రకారం డబ్బుకు తగిన విలువ ఇచ్చే ఫోనుగా కనిపిస్తోంది. 

Moto G54 5G First sale

Moto G54 5G First sale సెప్టెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది. ఈ ఫోన్ కేవలం రూ. 15,999 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తుంది. అయితే, 12GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 18,999 రూపాయలు మీరు ఖర్చు చేయవలసి ఉంటుంది.

Moto G54 5G offers

ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అఫర్ తో కొనేవారికి రూ. 1,500 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది మోటోరోలా.  ఈ ఫోన్ ను బ్యాంక్'డిస్కౌంట్ ఎఫ్రా మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో Flipkart నుండి కొనుగోలు చేయవచ్చు.  

ఏమిటి ఈ Moto G54 5G ప్రత్యేకతలు?

Moto G54 5G ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో గొప్ప ప్రత్యేకతలనే కలిగి వుంది. ఈ ఫోన్  6.5 ఇంచ్ 120Hz LCD డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 7020 ప్రోసెసర్ మరియు 12GB RAM తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందించ గలదు. ఈ మోటోరోలా Latest 5G Smartphone ఆడియో పరంగా Dolby Atmos మరియు Moto Spatial Sound తో కూడా ఆకట్టుకుంటుంది. 

మోటో జి54 5G 50MP OIS ప్రధాన కెమేరా కలిగిన క్వాడ్ ఫిక్షన్ కెమేరా సెటప్ తో వస్తుంది. వాస్తవానికి, ప్రైస్ ను దృష్టిలో ఉంచుకుంటే మోటో g సిరీస్ నుండి కేవలం 16 వేల ధరలో 8GB RAM మరియు 50MP OIS Camera తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే అవుతుంది. 

మరొక గొప్ప విషయం ఏమిటంటే రెగ్యులర్ గా 5000 mAh బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ లను లాంఛ్ చేస్తున్న మోటోరోలా ఈ Moto G54 5G స్మార్ట్  ఫోన్ ను మాత్రం 6000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ కేహార్జ్ సపోర్ట్ తో అందించింది. 

అతితక్కువ ధరలో హెవీ RAM మరియు స్టోరేజ్ తో పటు మంచి పెర్ఫార్మెన్స్ అందించే ఫోన్ కోరుకునే వారికి ఈ ఫోన్ గొప్ప ఎంపిక అవుతుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :