2016 లో లేటెస్ట్ గా మోటోరోలా నుండి రావలసిన G సిరిస్ మోడల్ పై నిన్న ఇంటర్నెట్ లో కొన్ని ఇమేజెస్ leaks జరిగాయి. చైనీస్ వెబ్ సైట్ లో ఇవి ప్రత్యేక్షమయ్యాయి.
అప్ కమింగ్ మోటో G4 లో ఫ్రంట్ సైడ్ హోమ్ బటన్ లాంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ కనిపిస్తుంది. actual గా మోటో లో ఎప్పుడూ ఫ్రంట్ లో ఫిజికల్ బటన్స్ లేవు.
అలాగే వెనుక లెన్స్ తో పాటు ఫ్లాష్ తో కలుపుకొని కొత్త డిజైన్ తో రేర్ కెమేరా సెట్ అప్ ఉండనుంది. ట్విటర్ లో evan blass పోస్ట్ చేసిన స్కెచ్ వలె ఉంది డిజైన్..
WinFuture కు చెందిన Roland Quandt అనే మరో వ్యక్తి మరి కొన్ని విషయాలను ట్విటర్ లో పోస్ట్ చేయటం జరిగింది. G4 అండ్ G3 ప్లస్ అనే రెండు వేరియంట్స్ రిలీజ్ కానున్నాయి ఈ ఇయర్ G సిరిస్ లో..
రెండింటిలో 5.5 in డిస్ప్లే, 16GB ఇంటర్నెల్ స్టోరేజ్ కామన్ గా ఉండగా G4 లో 13MP రేర్ కెమేరా ఉండగా, G4 ప్లస్ లో 16MP రేర్ కెమేరా ఉండనుంది. ఇవి మే లో రిలీజ్ అవుతుంది.
కొత్త డిజైన్ change తో పాటు curved గ్లాస్ టాప్ లో ఉండగా ఫోన్ కు ఫ్రంట్ సైడ్ bezels అన్నీ చిన్నగా ఉంటాయని రిపోర్ట్స్ ప్రైసెస్ పై కూడా కామెంట్ చేసిన రోలాండ్..18 వేల నుండి 21 వేల రూ వరకూ ఉంటాయని తెలిపారు.
https://twitter.com/rquandt/status/721135320276852740
మోటో X3 అనే మోడల్ కూడా leak అయ్యింది. ఇది 2016 లో కంపెని నుండి వచ్చే ఫ్లాగ్ షిప్ మోడల్ అని అంచనా. 5 in డిస్ప్లే తో వస్తుంది అని రిపోర్ట్స్.