Moto G35 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను మోటోరోలా అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ చాలా గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుందని మోటోరోలా వెల్లడించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ను 4K వీడియో రికార్డింగ్ సపోర్టింగ్ కలిగిన గొప్ప కెమెరా సిస్టం మరియు మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లంచ్ చేస్తుందని మోటోరోలా ప్రకటించింది.
మోటోరోలా మోటో జి 35 5జి స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తుంది. Flipkart ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది. ఈ ఫోన్ కోసం అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో ఈ ఫోన్ టీజింగ్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది.
మోటో జి 35 5జి స్మార్ట్ ఫోన్ ను 6.7 ఇంచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు FHD+ రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను Unisoc T760 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 4GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB వరకు ర్యామ్ బూస్ట్ సపోర్ట్ తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP క్వాడ్ పిక్సెల్ కెమెరాని 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన రియర్ కెమెరా మరియు 16Mp సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ ను 20W ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh ఈజ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు కూడా మోటోరోలా తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన డ్యూయల్ రియర్ స్పీకర్ సెటప్ ఉన్నట్లు కూడా మోటోరోలా తెలిపింది.
Also Read: Poco M7 Pro లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన పోకో.!
ఈ అప్ కమింగ్ మోటోరోలా ఫోన్ థింక్ షీల్డ్ ప్రొటెక్షన్, మోటో సెక్యూర్ తో ఉంటుంది మరియు Android 14 OS తో పని చేస్తుంది.