Moto G35 5G: బడ్జెట్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఫోన్ వచ్చేసింది.!

Moto G35 5G: బడ్జెట్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఫోన్ వచ్చేసింది.!
HIGHLIGHTS

Moto G35 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది

G35 ను బడ్జెట్ ధరలో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో లాంచ్ చేసింది

ఈ బడ్జెట్ 5జి ఫోన్ ఆకర్షనీయమైన ఫీచర్స్ ను ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది

Moto G35 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో మోటోరోలా లాంచ్ చేసింది. కేవలం ఇది మాత్రమే కాదు మరిన్ని ఆకర్షనీయమైన ఫీచర్స్ ను ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. ఈరోజే సరికొత్తగా ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ మోటోరోలా బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు ఫీచర్లు తెలుసుకుందాం పదండి.

Moto G35 5G: ధర

మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 9999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ మొదలువుతుంది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ చేస్తుంది.

Moto G35 5G: ఫీచర్స్

మోటోరోలా మోటో జి 35 స్మార్ట్ ఫోన్ విజన్ బూస్టర్ సపోర్ట్ కలిగిన 6.72 ఇంచ్ FHD+ స్క్రీన్ ను కలిగి వుంది. ఈ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను Unisoc T760 ఆక్టా కోర్ 5G చిప్ సెట్ తో మోటోరోలా అందించింది. ఈ చిప్ సెట్ కి జతగా 4GB ర్యామ్, 8GB వరకు ర్యామ్ బూస్ట్ సపోర్ట్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

Moto G35 5G Launched

ఈ మోటోరోలా లేటెస్ట్ స్,545జి స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP + 8MP క్వాడ్ పిక్సల్ కెమెరా సెటప్ కలిగి వుంది మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి వుంది. ఈ ఫోన్ మైన కెమెరాతో 30fps వద్ద 4K వీడియోలు షూట్ చేయక చేయవచ్చని మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు కూడా ఉన్నాయి.

Also Read: Redmi Note 14 Pro+ 5G అండర్ వాటర్ కెమెరా సహా పవర్ ఫుల్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

ఈ ఫోన్ ను వేగాన్ లెథర్ బ్యాక్, స్లీక్ డిజైన్ మరియు గొప్ప కలర్ ఆప్షన్ లలో అందించింది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీని 20W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo