Moto G32: రేపు ఫస్ట్ సేల్ కి రానున్న బడ్జెట్ 8GB ర్యామ్ ఫోన్.!
Moto G32 మొదటి సారిగా సేల్ కి అందుబాటులోకి రానున్నది
ఈ ఫోన్ Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది
ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలోనే 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వచ్చింది
మోటోరోలా ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ Moto G32 మొదటి సారిగా సేల్ కి అందుబాటులోకి రానున్నది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఫోన్ Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలోనే 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 12OS వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.
Moto G32: ధర మరియు ఆఫర్లు
Moto G32 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (4GB+64GB) ధర రూ.10,499. రెండవ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ.11,999 రూపాయలకు లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart నుండి సేల్ అవుతుంది. ఈ ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది.
Moto G32: స్పెక్స్
Moto G32 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ FHD+ IPS LCD డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను కలిగివుంటుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP+8MP+2MP రియర్ కెమెరాతో వుంది. ముందు పంచ్ హోల్ లో 16MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.