మోటోరోలా ఇండియాలో మరొక కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 30న మోటోరోలా విడుదల చేయబోతున్న Moto G24 స్మార్ట్ ఫోన్ గురించి మనం మాట్లాడుకుంటోంది. మోటో జి24 స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లతో ఈ ఫోన్ టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకమైన టీజింగ్ పేజ్ తో టీజ్ చేస్తోంది.
మోటో జి24 స్మార్ట్ ఫోన్ ను 4జి ప్రోసెసర్ మరియు గొప్ప డిజైఆం తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ ను అల్ట్రా ప్రీమియం డిజైన్ మరియు రెండు కలర్ ఆప్షన్ లలో లాంచ్ చేయనున్నట్లు టీజింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ను MediaTek Helio G85 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో లాంచ్ చేస్తున్నట్లు మోటో తెలిపింది. ఇది 8GB RAM మరియు 8GB వరకూ RAM Boost ఫీచర్ తో టోటల్ 16GB RAM సౌలభ్యాన్ని అందిస్తుందని మోటో తెలిపింది.
ఈ ఫోన్ లో 6.6 ఇంచ్ బిగ్ డిస్ప్లేని మరియు 50MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమేరా ఉన్నట్లు టీజింగ్ ద్వారా తెలిపింది. ఇదే కాదు, 6000mAh బిగ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జ్ మరియు లేటెస్ట్ Android 14 OS వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి.
Also Read: OPPO Reno11 5G పైన రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ తో అందిస్తోంది మోటోరోలా. ఈ ఫోన్ IP52 వాటర్ రేపెళ్లేంట్ డిజైన్ తో వస్తుంది.
ఈ ఫోన్ లో ఫేస్ అన్లాక్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉన్నాయి. ఈ అప్ కమింగ్ మోటో ఫోన్ ను చూస్తుంటే, ప్రీమియం డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో విడుదల కాబోతున్నట్లు కనిపిస్తోంది.