Dolby Atmos, 50MP క్వాడ్ కెమేరాతో వస్తున్న Moto G14 స్మార్ట్ ఫోన్.!
మోటోరోలా G సిరీస్ నుండి Moto G14 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతోంది
ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా Flipkart టీజింగ్ కూడా మొదలుపెట్టింది
Moto G14 స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కంపెనీ వెల్లడించింది
మోటోరోలా యొక్క బడ్జెట్ సిరీస్ గా పేరొందిన G సిరీస్ నుండి మరొక కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతోంది. అదే Moto G14 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను 4G ప్రోసెసర్ మరియు క్వాడ్ ఫిక్షన్ కెమేరాతో లాంచ్ చేయబోతున్నట్లు కూడా కంపెనీ టీజింగ్ ద్వారా చెబుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా Flipkart టీజింగ్ కూడా మొదలుపెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ఆగష్టు 1వ తేదీ లాంచ్ చేయడానికి డేట్ మరియు టైం సెట్ చేసింది మోటోరోలా. మోటోరోలా అప్ కమింగ్ ఫోన్ Moto G14 స్మార్ట్ ఫోన్ టీజ్డ్ స్పెక్స్ మరియు వివరాలు తెలుసుకుందామా.
Moto G14: టీజ్డ్ స్పెక్స్
Moto G14 స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. మోటో G14 స్మార్ట్ ఫోన్ ను 6.5 ఇంచ్ FHD+ డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే సన్నని అంచులను కలిగి ఉంటుంది. G14 ఫోన్ ను Unisoc T616 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుందని మోటో తెలిపింది. అంటే, ఈ ఫోన్ బడ్జెట్ ధరలో లాంచ్ అవుతుందని చెప్పకనే చెప్పింది. ఈ ఫోన్ 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో కూడా జతచేయ బడుతుంది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ కెమేరాలు కలిగిన క్వాడ్ ఫిక్షన్ సెటప్ వుంది. ఇందులో 50MP ప్రధాన కెమేరా ఉంటుంది. అలాగే, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ట్రిపుల్ కార్డ్ స్లాట్, IP52 వాటర్ రిపేలెంట్ డిజైన్ తో మోటో జి14 వస్తుంది.
ఈ ఫోన్ పైభాగంలో Dolby Atmos లోగోని కూడా అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ మోటోరోలా స్టైల్ క్లీన్ డిజైన్ మరియు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13OS తో కూడా వస్తుంది.
విషయం సూటిగా చెప్పాలంటే, ఈ ఫోన్ ధర తప్ప అన్ని వివరాలను కంపెనీ ఈ టీజింగ్ ద్వారా వెల్లడించిందని చెప్పొచ్చు.