మోటోరోలా ఈరోజు ఇండియాలో Moto G14 4G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్ లో 5G హవా నడుస్తుండగా, మోటోరోలా మాత్రం 4G తో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. ఒక్క నెట్ వర్క్ విషయం పక్కన పెడితే, ఈ ఫోన్ మిగతా అన్ని విషయాల్లో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జ్,FHD+ డిస్ప్లే, సొగసైన డిజైన్ మరియు పెద్ద స్టోరేజ్ వంటి అన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కూడా కలిగి వుంది. ఈరోజే భారతీయ మార్కెట్ లో విడుదలైన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క వివరాలు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
మోటోరోలా ఈ ఫోన్ ను కేవలం 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ మెమోరీ వేరియంట్ తో మాత్రమే విడుదల చేసింది. ఈ ఫోన్ ధరను రూ. 9,999 గా నిర్ణయించింది. ఈరోజు నుండి Flipkart ద్వారా ఈ ఫోన్ Pre-Book లను కూడా మోటోరోలా మొదలు పెట్టింది. అయితే, ఆగష్టు 8 నుండి ఈ ఫోన్ సేల్ ప్రారంభమవుతుంది.
ఈ ఫోన్ 10 వేల ఉప బడ్జెట్ లో 6.5 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ డిస్ప్లేతో వచ్చింది. ఇది OTT కంటెంట్ ను మంచి క్వాలిటీ తో చూడటానికి సరిపోతుంది.
ఈ మోటోరోలా ఫోన్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ ను కలిగి వుంది. అంటే, మీ కంటెంట్ అనుభూతి మరింత పెరుగుతుంది.
మోటోరోలా ఈ ఫోన్ ను 4GB ర్యామ్ కి జతగా 128GB స్టోరేజ్ తో జత చేసింది. ఇది మీరు బోలెడన్ని ఫోటోలు, వీడియోలను స్టోర్ చేసుకోవడానికి మూవీస్ మరియు కంటెంట్ ను స్టోర్ చేసుకోవడానికి సరిపోతుంది.
ఈ ఫోన్ లో 50MP క్వాడ్ పిక్సెల్ కెమేరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమేరా వుంది. ఈ ఫోన్ తో క్వాలిటీ ఫోటోలు మరియు 30fps వద్ద FHD వీడియో లను చిత్రీకరించవచ్చు. ముందు 8MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.
మోటో జి14 స్మార్ట్ ఫోన్ 20W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన భారీ 5000 mAh బ్యాటరీని కలిగి వుంది. అంటే, ఎక్కువ సమయం ఫోన్ ను ఉపయోగించడానికి మరియు బ్యాటరీ అయిపోతే త్వరగా ఛార్జ్ చెయ్యడానికి వీలుంటుంది.