Moto G13: 10 వేల కంటే తక్కువ ధరలో స్టాక్ Adnroid 13 OS తో వచ్చింది.!
Moto G13 స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో విడుదలయ్యింది
ఈ స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ Near- Stock Android 13 OS తో అందించడం విశేషం
ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టినట్లు మోటోరోలా తెలిపింది
గత కొన్ని రోజులుగా మోటోరోలా టీజింగ్ చేస్తూ వస్తున్నా స్మార్ట్ ఫోన్ Moto G13 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అండర్ రూ.10,000 బడ్జెట్ కేటగిరిలో మోటోరోలా ప్రకటించింది. అయినా కూడా ఈ స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ Near- Stock Android 13 OS తో అందించడం విశేషం. అంతేకాదు, ఈ ఫోన్ ను కొత్త డిజైన్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 50MP క్వాడ్ పిక్సెల్ కెమేరా సిస్టమ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టినట్లు మోటోరోలా తెలిపింది.
Moto G13: ధర
మోటోరోలా ఈ Moto G13 స్మార్ట్ ఫోన్ ను 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ తో రూ.9,999 ధరలో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 5వతేది నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Moto G13: స్పెక్స్ మరియు ఫీచర్లు
Moto G13 స్మార్ట్ ఫోన్ HD+(1600 x 720) రిజల్యూషన్ కలిగిన 6.5 ఇంచ్ IPS LCD డిస్ప్లేని కలిగివుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ మరియు DCI-P3 కలర్ స్పేస్ తో వస్తుంది. ఈ మోటో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio G85 ఆక్టా కోర్ 4G ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. జతగా 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ సపోర్ట్ ను కూడా కలిగి వుంటుంది.
కెమేరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సిస్టం ను కలిగివుంది. ఇందులో, 50MP ప్రధాన కెమేరా, 2MP డెప్త్ మరియు 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందు పంచ్ హోల్ లో 8MP సెల్ఫీ కెమేరా వుంది. ఈ వెనుక కెమేరాతో 30fps వద్ద 4K వీడియోలను, UHD మరియు FHD వీడియోలను (30/60fps) వద్ద మరియు FHD స్లోమోషన్ వీడియోలను 120fps వద్ద రికార్డ్ చేయవచ్చని మోటోరోలా తెలిపింది.
ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగివుంది. ఈ ఫోన్ రెగ్యులర్ 10W ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీని కలిగి వుంటుంది.