Moto G13: మోటో లేటెస్ట్ బడ్జెట్ ఆండ్రాయిడ్ 13 ఫోన్ ఫస్ట్ సేల్ రేపు జరగనున్నది.!

Updated on 04-Apr-2023
HIGHLIGHTS

మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Moto G13 మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తోంది

కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ కేటగిరిలో వచ్చిన స్టాక్ ఆండ్రాయిడ్ 13 స్మార్ట్ ఫోన్

ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 5వతేది నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది

మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Moto G13 మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తోంది. కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ కేటగిరిలో వచ్చిన ఈ స్టాక్ ఆండ్రాయిడ్ 13 స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart ద్వారా సేల్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ ప్రీమియం డిజైన్ మరియు మరిన్ని ఇతర ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టినట్లు మోటోరోలా తెలిపింది. ఈ లేటెస్ట్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఇక్కడ చూడవచ్చు.           

Moto G13: ధర

మోటోరోలా ఈ Moto G13 స్మార్ట్ ఫోన్ ను 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ తో రూ.9,999 ధరలో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 5వతేది మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. 

Moto G13: స్పెక్స్ మరియు ఫీచర్లు

Moto G13 స్మార్ట్ ఫోన్ HD+(1600 x 720) రిజల్యూషన్ కలిగిన 6.5 ఇంచ్ IPS LCD డిస్ప్లేని కలిగివుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ మరియు DCI-P3 కలర్ స్పేస్ తో వస్తుంది. ఈ మోటో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio G85 ఆక్టా కోర్ 4G ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. జతగా 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ సపోర్ట్ ను కూడా కలిగి వుంటుంది.

కెమేరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సిస్టం ను కలిగివుంది. ఇందులో, 50MP ప్రధాన కెమేరా, 2MP డెప్త్ మరియు 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందు పంచ్ హోల్ లో 8MP సెల్ఫీ కెమేరా వుంది. ఈ వెనుక కెమేరాతో 30fps వద్ద 4K వీడియోలను, UHD మరియు FHD వీడియోలను (30/60fps) వద్ద మరియు FHD స్లోమోషన్ వీడియోలను 120fps వద్ద రికార్డ్ చేయవచ్చని మోటోరోలా తెలిపింది.

ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగివుంది. ఈ ఫోన్ రెగ్యులర్ 10W ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీని కలిగి వుంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :