Moto G05 Launch: బడ్జెట్ ఫోన్ పెద్ద స్క్రీన్ మరియు Dolby Atmos తో లాంచ్ కి సిద్ధం.!

Updated on 02-Jan-2025
HIGHLIGHTS

2025 ప్రారంభంలో మోటోరోలా కొత్త లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది

మోటో G సిరీస్ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ ను ప్రకటించింది

Moto G05 స్మార్ట్ ఫోన్ Dolby Atmos వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ చేస్తోంది

Moto G05 Launch: 2025 ప్రారంభంలో మోటోరోలా కొత్త లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. మోటోరోలా బడ్జెట్ సిరీస్ అయిన మోటో G సిరీస్ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ ను ప్రకటించింది. అదే, Moto G05 స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను పెద్ద స్క్రీన్ మరియు Dolby Atmos సపోర్ట్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ చేస్తోంది. మోటోరోలా లాంచ్ చేయనున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్ వివరాల పై ఒక లుక్కేద్దాం పదండి.

Moto G05 Launch: డేట్

Moto G05 స్మార్ట్ ఫోన్ జనవరి 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ వేరియంట్లలో లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను Flipkart ద్వారా మోటోరోలా అందించింది. దీనికోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించింది.

Also Read: Xiaomi Pad 7 ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన షియోమీ.!

Moto G05 : కీలకమైన ఫీచర్స్

మోటో జి 05 స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం వేగాన్ లెదర్ డిజైన్ తో అందిస్తున్నట్లు మోటరోలా వెల్లడించింది. ఈ ఫోన్ లో 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన పెద్ద 6.67 ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ అప్ కమింగ్ ఫోన్ ను మీడియాటెక్ Helio G81 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా తెలిపింది. మోటో జి05 ఫోన్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ మరియు 12GB వరకు ర్యామ్ బూస్ట్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది.

ఈ అప్కమింగ్ మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP క్వాడ్ పిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఈ సెగ్మెంట్ లో Android 15 OS తో వచ్చే ఫోన్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ లో 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5200 mAh బిగ్ బ్యాటరీ వుంది. ఈ ఫోన్ Dolby Atmos మరియు Hi-Res Audio సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫోన్ ఎంటర్టైన్మెంట్ కి తగిన అన్ని ఫీచర్స్ కి లాంచ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :