Moto G04s Launch: మోటో బడ్జెట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన కంపెనీ.!
మోటో బడ్జెట్ ఫోన్ సిరీస్ ‘G’ సిరీస్ నుండి అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది
Moto G04s ప్రత్యేకతలు మరియు కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది
అత్యంత వేగంగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్న కంపెనీలలో ఒకటిగా మోటోరోలా నిలుస్తుంది
Moto G04s Launch: మోటో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ‘G’ సిరీస్ నుండి అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ ప్రత్యేకతలు మరియు కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది. ఇండియన్ మొబైల్ మార్కెట్ లో అత్యంత వేగంగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్న కంపెనీలలో ఒకటిగా మోటోరోలా నిలుస్తుంది. గత వారం మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ను విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు మోటో జి04s ఫోన్ ను ప్రకటించింది.
Moto G04s Launch:
ఈ మోటో అప్ కమింగ్ ఫోన్ ను మే 30వ తేదీన ఇండియాలో విడుదల చేస్తున్నట్లు మోటోరోలా ప్రకటించింది. ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజిని అందించింది మరియు దీని ద్వారా ఈ ఫోన్ కీలకమైన వివరాలను కూడా వెల్లడించింది.
Moto G04s: ఫీచర్లు
మోటో జి04s స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ చాలా సన్నగా మరియు ప్రీమియం లుక్స్ తో కనిపించేలా ప్రీమియం డిజైన్ తో అందిస్తున్నట్లు మోటోరోలా తెలిపింది. ఈ మోటోరోలా అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కూడా Dolby Atmos సౌండ్ సపోర్ట్ ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.
మోటో జి04s స్మార్ట్ ఫోన్ బడ్జెట్ 4G ప్రోసెసర్ అయిన Unisoc T606 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. దీనికి జతగా 4GB RAM + 4 GB ర్యామ్ బూస్ట్ తో కలిపి 8GB వరకూ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లేటెస్ట్ Android 14 OS తో నడుస్తుందని కూడా మోటో తెలిపింది. ఈ ఫోన్ గ్రీన్, బ్లూ, బ్లాక్ మరియు ఆరంజ్ నాలుగు కలర్ ఆప్షన్ లలో వస్తున్నట్లు కూడా టీజర్ పేజ్ ద్వారా వెల్లడించింది.
Also Read: Xiaomi 14 CIVI: సినిమాటిక్ కెమెరా మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో వస్తోంది.!
ఇక ఈ ఫోన్ కలిగి ఉన్న మరిన్ని ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే, ఈ ఫోన్ ఛార్జ్ టెక్ లేదా సపోర్ట్ గురించి మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ ఈ సెగ్మెంట్ లో 50MP AI కెమెరా కలిగిన మొదటి ఫోన్ అవుతుందని మోటోరోలా ప్రకటించింది. అయితే, ఇందులో వెనుక సింగల్ కెమెరా సెటప్ మాత్రమే ఉంది. ఇందులో, పోర్ట్రైట్ మోడ్, ఆటో నైట్ విజన్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్లు ఉన్నట్లు కూడా టీజింగ్ ద్వారా తెలిపింది.
వాస్తవానికి, మోటో జి04 స్మార్ట్ ఫోన్ ను కూడా దాదాపు ఇవే ఫీచర్స్ తో రూ. 6,999 ధరలో ముందే లాంచ్ చేసింది. అయితే, ఈ అప్ కమింగ్ ఫోన్ మోటో జి04s లో మాత్రం 50MP రియర్ కెమెరా ను అందించింది. మోటో జి04 లో మాత్రం వెనుక 16MP కెమెరా మాత్రమే వుంది. దీన్ని బట్టి ఈ ఫోన్ కూడా దాదాపు ఇదే ధర పరిధిలో రావచ్చని అంచనా వేస్తున్నారు.