8,999 రూ లకు ఇండియాలో MOTO G4 play స్మార్ట్ ఫోన్ లాంచ్
8,999 రూ లకు ఇండియాలో లెనోవో(మోటోరోలా ను లెనోవో కొనేసింది) నుండి Moto G Play 4th Gen పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది.
ఫోన్ లో హైలైట్స్ అయితే నాకు ఏమీ కనపడటం లేదు. ఫోన్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో ఆల్రెడీ సేల్స్ అవుతుంది అమెజాన్ లో exclusive గా.
స్పెక్స్ – 5 in HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 410 SoC, 2GB ర్యామ్, 2800 mah బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ చేసే చార్జర్ కూడా వస్తుంది ఫోన్ తో. ఫోన్ తో పాటు వచ్చే ఈ చార్జర్ తో 15 నిమిషాలు చార్జింగ్ చేస్తే 5 గం బ్యాక్ అప్ వస్తుంది అని చెబుతుంది కంపెని.
8MP f/2/2 aperture లెన్స్ రేర్ కెమెరా with ఫుల్ HD వీడియో రికార్డింగ్ సపోర్ట్ at 30fps. 5MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష మల్లో.
16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్. వాటర్ repellent నానో కోటింగ్ కూడా ఉంది. ఇది వాటర్ రెసిస్టన్స్ కాదు. కాని ఫోన్ పై వాటర్ పడినా ఫోన్ పాడవకుండా చేస్తుంది.
ఫోన్ కొంటె వస్తున్న ఆఫర్స్..
- ఫోన్ ను సెప్టెంబర్ 13 లోపు కొన్న వారికి Yatra.com అనే వెబ్ సైట్ నుండి 15 వేలు e-cash ఇస్తుంది. అంటే ఆ వెబ్ సైట్ నుండి ట్రావెలింగ్ బుకింగ్స్ చేసుకుంటే yatra wallet లో ఉన్న e-cash ను వాడుకోగలరు.
- moto pulse 2 హెడ్ ఫోన్స్ కొంటే వీటిపై 300 కాష్ బ్యాక్ ఇస్తుంది ఫోన్ ను sep 13 లోపు కొన్న వారికీ.
- Kindle ebooks పై కూడా 80% డిస్కౌంట్ ఉంటుంది.
- ఇంకా అమెజాన్ యాప్ ద్వారా ఫోన్ కొంటే, లక్కీ కస్టమర్స్ కు 100 % ఫోన్ కొన్న అమౌంట్ ను తిరిగి ఇస్తుంది కంపెని.
పర్సనల్ ఒపినియన్ లో స్పెక్స్ వైజ్ గా ఫోన్ లో పెద్దగా కంటెంట్ లేదు. ఈ ఫోన్ కొనటానికి కనిపిస్తున్న కారణాలు..
- ఆండ్రాయిడ్ లేటెస్ట్ అప్ డేట్స్ తొందరగా వస్తాయి.(సంవత్సరానికి ఒక సారి వచ్చే UI changing అప్ డేట్స్ మాత్రమే పరిగణించదగ్గవి)
- మోటోరోలా బ్రాండ్ వాల్యూ
- moto కస్టమర్ కేర్ ఆఫ్టర్ సేల్స్.
ఈ బడ్జెట్ లో రియల్ టైమ్ కంటెంట్ వైజ్ గా redmi 3S prime బెస్ట్. స్పెక్స్ వైజ్ గా కూడా బాగుంది అని మీకు స్పెక్స్ చూస్తే తెలిసిపోతుంది. క్రింద రెండింటికీ ఉన్న మేజర్ స్పెక్స్ డిఫరెన్స్ చూడగలరు..
- స్నాప్ డ్రాగన్ 430 SoC ఉంది. పైగా బాగుంది. Moto G4 ప్లే లో SD 410 ఉంది.
- 3GB ర్యామ్ ఉంది ప్రైమ్ లో.
- 32GB స్టోరేజ్ మరియు 13MP కెమెరా
- ప్రైస్ – 8,999 రూ. same అదే ప్రైస్.