Moto G13: కొత్త ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్.. ఫీచర్ల పైన ఒక లుక్కేయండి.!
మోటోరోలా ఇండియాలో మరొక కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్ల గురించి కూడా టీజింగ్ చేస్తోంది
Moto G13 ను లేటెస్ట్ నియర్ స్టాక్ Android 13 తో తీసుకువస్తునట్లు మోటోరోలా తెలిపింది
మోటోరోలా ఇండియాలో మరొక కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మోటో G సిరీస్ నుండి తీసుకురానున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్ల గురించి కూడా టీజింగ్ చేస్తోంది. Flipkart ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. అదే Moto G13 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను లేటెస్ట్ నియర్ స్టాక్ Android 13 తో తీసుకువస్తునట్లు మోటోరోలా తెలిపింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు ఎలా ఉండనున్నాయో ఒక లుక్కేద్దామా.
Moto G13: టీజ్డ్ స్పెక్స్
మోటోరోలా ఈ Moto G13 యొక్క చాలా స్పెక్స్ ను ఇప్పటికే టీజింగ్ ద్వారా వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ IPS LCD డిస్ప్లేని కలిగి వుంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ వుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G85 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను కలిగి వుంటుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ పిక్సెల్ రియర్ కెమెరాతో వుంది. ముందు పంచ్ హోల్ లో 8MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ లేటెస్ట్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 13 OS పైన పనిచేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో కూడా Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయని కంపెనీ టీజింగ్ ద్వారా వెల్లడించింది.