Moto Edge 40: మిడ్ రేంజ్ ధరలో భారీ ఫీచర్లతో వచ్చిన మోటో కొత్త ఫోన్.!
Moto Edge 40 5G ను ఈరోజు లాంచ్ చేసింది
మిడి రేంజ్ ధరలో 3D Curved డిస్ప్లే తో వచ్చింది
రూ. 2,000 రూపాయల స్పెషల్ డిస్కౌంట్ ను అఫర్ తో లాంచ్
మోటోరోలా ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Moto Edge 40 5G ను లాంచ్ చేసింది. ఎడ్జ్ సిరీస్ నుండి అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఫోన్ గా ఎడ్జ్ 40 నిలుస్తుంది. ఎందుకంటే, ఈ లేటెస్ట్ మోటో స్మార్ట్ ఫోన్ కేవలం 30 వేల రూపాయల మిడి రేంజ్ ధరలో 3D Curved డిస్ప్లే మరియు 50MP OIS కెమేరా వంటి మరిన్ని ప్రత్యేకతలను కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలను ఇక్కడ చూడవచ్చు.
Moto Edge 40: ధర & ఆఫర్స్
మోటో ఎడ్జ్ 40 స్మార్ట్ ఫోన్ 8GB మరియు 256 GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ తో రూ. 29,999 ధరలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అఫర్ లో భాగంగా ఈ ఫోన్ ని ఎక్స్ ఛేంజ్ అఫర్ ద్వారా కొనే వారికి రూ. 2,000 రూపాయల స్పెషల్ డిస్కౌంట్ ను అఫర్ చేస్తున్నట్లు మోటో ప్రకటించింది.
మోటో ఎడ్జ్ 40 మే 30వ తేదీ నుండి Flipkart, motorola.in మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్స్ నుండి లభిస్తుంది.
Moto Edge 40: స్పెక్స్ & ఫీచర్లు
Moto Edge 40 స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ వేరియంట్ కాంపిటీటివ్ డిస్ప్లే తో వచ్చింది. ఈ ఫోన్ లో మోటోరోలా 144Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన 6.55 ఇంచ్ 3D Curved డిస్ప్లేని అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 92.7% స్క్రీన్ టూ బాడీ రేషియో తో ఉంటుంది.
ఈ ఫోన్ లో 50MP డ్యూయల్ కెమేరా OIS సపోర్ట్ మరియు 13 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరాతో జతగా అందించింది. ఎడ్జ్ 40 లో ముందు 32MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. మెయిన్ మరియు సెల్ఫీ కెమేరాతో 4K వీడియో లను 30fps వద్ద FHD వీడియో లను 30fps /60fps వద్ద రికార్డ్ చెయ్యవచ్చని మోటో తెలిపింది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13OS పైన పని చేస్తుంది మరియు రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్ లతో పాటుగా 2 మేజర్ OS అప్డేట్ లను కూడా అందుకోగలదని కంపెనీ తెలిపింది. మోటో ఎడ్జ్ 40 ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 15 వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4400 mAh బ్యాటరీతో వస్తుంది. ఎడ్జ్ 40 ఫోన్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో డ్యూయల్ స్టీరియో స్పీకర్ లను, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కొద కలిగి వుంది.
ఈ ఫోన్ చాలా సన్నని డిజైన్ తో పాటుగా IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్ ఫీచర్ ను కలిగి ఉందని కూడా మోటో గొప్పగా చెబుతోంది.