Moto Edge 40 స్మార్ట్ ఫోన్ సేల్ ను వెంట వెంటనే ప్రకటిస్తోంది కంపెనీ. స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ నుండి కూడా మంచి స్పందనను అందుకుంది మరియు ఈరోజు 14 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మరొకసారి సేల్ కు అంధుబాటులోకి వస్తోంది. ఈ మోటో స్మార్ట్ ఫోన్ కేవలం 30 వేల కంటే తక్కువ ధరలో 3D Curved డిస్ప్లే, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు eSIM సపోర్ట్ తో వచ్చిన ఫోన్ గా నిలుస్తుంది.
ఈ ఫోన్ యొక్క నెక్స్ట్ సేల్ వివరాల్లోకి వెళితే, Moto Edge 40 స్మార్ట్ ఫోన్ నెక్స్ట్ సేల్ జూన్ 14 న మొదలవుతుందని మోటోరోలా ప్రకటించింది. Flipkart ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ రూ. 29,999 ధరతో లాంచ్ అయ్యింది మరియు అదే రేటుతో సేల్ అవుతుంది.
Moto Edge 40 ఫోన్ లో 5 ప్రధాన ఆకర్షణలు ఉన్నాయి మరియు ఈ ఫోన్ పైన మరింత హైప్ పెంచేలా చేస్తునట్లు చెప్పవచ్చు. ఈ మోటో స్మార్ట్ ఫోన్ 3D Curved డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. మోటోరోలా ఈ ఫోన్ ను మెటల్ ఫ్రెమ్ మారియు ప్రీమియం లెథర్ తో చక్కని డిజైన్ మరియు IP68 రేటింగ్ తో కూడా అందించింది.
ఈ మోటో ఫోన్ ఫిజికల్ SIM కార్డ్ స్లాట్ తో పాటు eSIM సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ 50MP OIS డ్యూయల్ కెమేరాని 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో కలిగి వుంది. దీని ప్రోసెసర్ గురించి చెప్పాలంటే, మీడియాటెక్ Dimensity 8020 5G ప్రోసెసర్ తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే అవుతుంది. ఈ ఫాస్ట్ ప్రోసెసర్ కి జతగా 8GB మరియు హెవీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది. ముఖ్యంగా, ఈ మోటో ఫోన్ యాడ్స్ మరియు బ్లోట్ వేర్ లేని Android 13 OS పైన పని చేస్తుంది. ఈ మోటో ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జ్ మరియు 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది.