3500mAh బ్యాటరీ తో moto E 3 Power స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 26-Aug-2016

మోటోరోలా moto E గుర్తుందా మీకు. ఈ సిరిస్ లో ఆల్రెడీ E3 మోడల్ UK లో అనౌన్స్ అయ్యింది. ఇది ఇలా ఉంటే ఇదే సిరిస్ లో E 3 Power అనే పేరుతో మరొక వేరియంట్ రిలీజ్ అయ్యింది హాంగ్కాంగ్ లో.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్,  5 in HD డిస్ప్లే, 64 bit 1GHz మీడియా టెక్ MT6735P క్వాడ్ కోర్ SoC, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్. 

3500 mah బ్యాటరీ, 4G LTE 8MP రేర్ కెమెరా LED flash ఆటో ఫోకస్ అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0.1 OS మార్ష్ మల్లో, క్విక్ చార్జర్, రేర్ స్పీకర్ ఉన్నాయి. ఫోన్ పిక్స్ అయితే ఇంకా బయటకు రాలేదు. కానీ మీరు ఫేస్ బుక్ పోస్ట్ లో చూసినది moto E power మోడలే.

ఫోన్ ప్రైస్ సుమారు 9,500 rs. అయితే ఈ ఫోన్ కొద్ది కాలంలోనే ఇండియన్ మార్కెట్ లోకి కూడా వస్తున్నట్లు ఈ రోజే మోటోరోలా ఇండియా బృందం తెలిపింది. మనిక: మీరు ఎప్పటినుండో నా పర్సనల్ ఫేస్ బుక్ ప్రొఫైల్ తెలపమని అడుగుతున్నారు. సో అడిగిన వారి కోసం నేను వ్రాసిన ఆర్టికల్ పేరు ప్రక్కన ఫేస్ బుక్ బటన్ ఉంటుంది. దానిపై టాప్ చేయగలరు. అయితే బటన్ మీరు ఆర్టికల్ బ్రౌజర్ లో ఓపెన్ చేస్తేనే కనిపిస్తుంది. ఇదే విండో లో పైన షేర్ అనే బటన్ ఉంటుంది, దాని పై టాప్ చేసి బ్రౌజర్ సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా same ఆర్టికల్ బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :