Moto e13: మోటో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్..!
Moto e13 మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి రానున్నది
ఈ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ మరియు చేతిలో కంఫర్ట్ ఫిట్ తో ఉంటుంది
Moto e13 రేపు మధ్యాహ్నం 12 నుండి Flipkart నుండి సేల్ అవుతుంది
మోటోరోలా కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Moto e13 మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి రానున్నది. కేవలం బడ్జెట్ ధరలో ఆండ్రాయిడ్ 13 (Go Edition) మరియు బిగ్ బ్యాటరీతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 నుండి Flipkart నుండి సేల్ అవుతుంది. ఈ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ మరియు చేతిలో కంఫర్ట్ ఫిట్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెక్స్ ఇక్కడ చూడవచ్చు.
Moto e13: ధర
Moto e13 స్మార్ట్ ఫోన్ ను Rs.6,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది 2GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ ధర. ఇందులో, 2GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ కూడా వుంది దీని దర Rs.7,999. ఈ స్మార్ట్ ఫోన్ Flipkart నుండి ఫిబ్రవరి 15 వ తేది మధ్యాహ్నం 12 నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Moto e13: స్పెషిఫికేషన్స్
మోటోరోలా Moto e13 పెద్ద 6.5 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లేని వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో కలిగివుంటుంది. ఈ ఫోన్ Unisoc T606 చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 2GB/4GB ర్యామ్ మరియు పెద్ద 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. నీటి తుంపర్ల నుండి రక్షణ కోసం ఈ ఫోన్ IP52 వాటర్ రేపెళ్లేంట్ డిజన్ తో వస్తుంది.
ఇక కెమెరా పరంగా, Moto e13 ఫోన్ వెనుక 13MP సింగిల్ కెమెరా సెటప్ తో వుంటుంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 (Go Edition) తో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో పెద్ద 5000 mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ తో కూడా ఉంది.