జూన్ నెలలో Moto C మరియు Moto C Plus స్మార్ట్ ఫోన్స్ లాంచ్

Updated on 20-May-2017
HIGHLIGHTS

బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రెడ్మీ 4 a కు ఇవి గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

 ఇప్పటివరకు మార్కెట్లో షియోమీ  తనకంటూ  ఒక స్థానం  సంపాదించుకుని  కొత్త  కొత్త మోడల్స్ తో తెగ  సందడి  చేస్తుంది అయితే దీనికి ధీటుగా మోటో కొత్త  ఫోన్స్  వచ్చేసాయి. ఈ మద్యనే  వచ్చిన బడ్జెట్  స్మార్ట్ ఫోన్ రెడ్మీ 4 a  కు ఇవి గట్టి పోటీ ఇవ్వనున్నాయి. మోటో నుంచి త్వరలో మోటో సీ, మోటో సీ ప్లస్ స్మార్ట్ ఫోన్లు భారత్ లో లాంచ్ కానున్నాయి. అన్నీ కుదిరితే జూన్ నెలలో ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. Moto C  మరియు  Moto C Plus  స్మార్ట్  ఫోన్స్  లాంచ్  కానున్నాయి. 

ఈ  ఫోన్ల  ధర  లు    కూడా చాలా  రీసనబుల్  గా వున్నాయి  , 8000 రూపాయల లోపే ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చి, మిగతా  ఫోన్స్  కి గట్టి  పోటీ  ఇవ్వనున్నారు. 

 ఈ స్మార్ట్  ఫోన్  బ్లాక్  మరియు  గోల్డ్ మరియు  రెడ్  కలర్స్  లో అందుబాటులో  ఉంటుంది. 
ఈ డివైస్  ఫ్రంట్  ప్యానెల్ లో  ఒక  ఫిజికల్  నావిగేషన్  బటన్  ఇవ్వబడింది. ఈ డివైస్  టాప్  పై  ఫ్రంట్  కెమెరా  ఇవ్వబడింది. ఈ డివైస్  బ్యాక్  ప్యానెల్  పై  ఒక  రేర్  కెమెరా  ఇవ్వబడింది. 

దీని  కెమెరా  Moto G5 Plus  లానే  ఉంటుంది . ఈ డివైస్  బాటమ్  లో స్పీకర్  గ్రిల్  మరియు మోటో లోగో  ఇవ్వబడింది.  ఈ డివైస్  లో 5.0 లేదా 5.2 ఇంచెస్  డిస్ప్లే  ఇవ్వబడింది . ఈ డివైస్  లో  క్వాల్ కాం  స్నాప్ డ్రాగన్  430 ప్రాసెసర్  ఇవ్వబడింది. ఈ  డివైస్  లో  16 MP  కెమెరా  ఉండవచ్చు .  ఈ  డివైస్  లో  ఆపరేటింగ్  సిస్టం  ఆండ్రాయిడ్  నౌగాట్  7.0 అవుట్ బాక్స్ ఉంది . ఈ డివైస్  లో  బ్యాటరీ  3800mAh  ,ఇవేకాకుండా మోటో  తన  E సిరీస్  స్మార్ట్  ఫోన్స్  ఫై  కూడా  పనిచేస్తుంది. 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :