CMF Phone 1 మరియు కొత్త లైనప్ లాంచ్ డేట్ వచ్చేసిందోచ్.!

Updated on 20-Jun-2024
HIGHLIGHTS

CMF Phone 1 విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది

ఈ కంపెనీ నుంచి మరో రెండు ప్రొడక్ట్స్ ను కూడా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది

జూలై 8 వ తేదీన మొత్తం మూడు ప్రొడక్ట్స్ ను విడుదల చేస్తుందని కన్ఫర్మ్ చేసింది

CMF Phone 1 స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే నథింగ్ సబ్ బ్రాండ్ CMF ప్రకటించింది. అయితే, అప్పటి నుండి ఈ ఫోన్ కోసం లాంచ్ డేట్ ను ప్రకటించకుండానే టీజింగ్ మాత్రం మొదలు పెట్టింది. అయితే, ఎట్టకేలకు ఈ స్మార్ట్ ఫోన్ మరియు కొత్త ఇయర్ బడ్స్ తో పాటు స్మార్ట్ వాచ్ ను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది.

CMF Phone 1 లాంచ్ డేట్

సిఎంఎఫ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ ను జూలై 8 వ తేది మధ్యాహ్నం 2: 30 గంటలకు ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. నథింగ్ సబ్ బ్రాండ్ అయిన ఈ కంపెనీ నుంచి మరో రెండు ప్రొడక్ట్స్ ను కూడా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సిఎంఎఫ్ ఈ తేదీన మొత్తం మూడు ప్రొడక్ట్స్ ను విడుదల చేస్తుందని కన్ఫర్మ్ చేసింది.

CMF Phone Launch

ఇందులో, Buds Pro 2 ఇయర్ బడ్స్ మరియు Watch Pro 2 స్మార్ట్ వాచ్ ఉన్నాయి. కంపెనీ లేటెస్ట్ గా విడుదల చేసిన లేటెస్ట్ ట్వీట్ లో ఈ వివరాలు కనిపిస్తున్నాయి. అయితే, ప్రతీ ప్రోడక్ట్ లో కూడా రింగ్ ను కామన్ గా చూపిస్తోంది. ఇక ఈ ఫోన్ మరియు ఇతర ప్రోడక్ట్స్ వివరాల్లోకి వెళితే, కంపెనీ ఈ ఫోన్ లాంచ్ డేట్ ను మాత్రమే అందించింది. ఈ ప్రొడక్ట్స్ యొక్క ఫీచర్స్ లేదా స్పెక్స్ వంటి ఎటువంటి వివరాలను ఇప్పటి వరకూ అందించలేదు.

Also Read: Vivo T3 Lite 5G: కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వివో.!

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్లు ఆన్లైన్ లో లీకయ్యాయి. ఈ లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ కెమెరా, లెథర్ బ్యాక్ మరియు ఇప్పటి వరకూ ఎప్పుడు చూడని విలక్షణమైన డిజైన్ తో కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ అడుగుభాగంలో పెద్ద రౌండ్ నాబ్ ఉన్నట్లు కూడా చూడవచ్చు. ఈ కొత్త నాబ్ ఈ ఫోన్ ను కొంత వినూత్నమైన డిజైన్ తో ఉన్నట్లు చూపిస్తోంది.

ఈ ఫోన్ సైడ్ లో ఒక చిన్న స్క్రూ ఉన్నట్లు కంపెనీ మరియు లీక్ స్టర్స్ కూడా చెబుతున్నారు. ఈ స్క్రూ ఈ ఫోన్ లో ఎటువంటి పాత్ర వహిస్తుందనే విషయం ఫోన్ లాంచ్ నాటికి తెలుస్తుంది కాబోలు. అయితే, ఈ ఫోన్ మరియు ఇతర ప్రొడక్ట్స్ లాంచ్ కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, మరిన్ని ఫీచర్లు వెల్లడించే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :