మీ ఫోన్ లో అవుట్ డేటెడ్ స్పెసిఫికేషన్ ను మార్చుకునే అవకాశం ఇస్తున్న పజిల్ ఫోన్
మాడ్యులర్ స్మార్ట్ ఫోన్ అంటే, మీకు నచ్చని హార్డ్ వేర్ స్పెక్ ను ఫోన్ మార్చకుండానే కేవలం హార్డ్ వేర్ మార్చుకోవటం. గూగల్ దిని పై చాలా కాలం నుండి పని చేస్తుంది.
గూగల్ కన్నా ముందు కొత్తగా Puzzlephone అదే తరహా లో వస్తుంది. ఫిన్ లాండ్ లో ప్రస్తుతం స్టార్ట్ అప్ దశలో ఉంది. 22 గంటల్లోనే 35,230 డాలర్స్ క్రౌడ్ ఫండింగ్ సంపాదించింది. వాళ్ళ లక్ష్యం 250,000 డాలర్స్.
పజిల్ ఫోన్ ను వాడుతున్న వారే customise, అప్ గ్రేడ్ మరియు రిపేర్ కూడా చేయగలరు. దీని వెనుక ఉన్న ఐడియా.. ఫోన్లోని అవుట్ డేట్ అయిన స్పెసిఫికేషన్స్ ను users మార్చుకునే అవకాశం ఇవ్వటం.
పజిల్ ఫోన్ లో మూడు భాగాలు ఉంటాయి. బ్రెయిన్, (ప్రొసెసర్, ర్యామ్, కెమేరా), స్పైన్ (డిస్ప్లే మరియు ఫోన్ structure), చివరిగా.. హార్ట్(బ్యాటరీ..etc).
ఇప్పుడు ఎలెక్ట్రానిక్ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, ఫోన్ కొంటే కనీసం 4 సంవత్సరాలు పాటు వర్క్ అయ్యేలా, వాడేలా తయారు చేయటమే మా లక్ష్యానికి ముఖ్య కారణం అని చెప్పింది పజిల్ ఫోన్ బృందం.
బ్లాక్ ప్లాస్టిక్ బాడీ లో ఉంటాయి ఫోన్ మాడ్యులర్ పరికరాలు అన్నీ. 16 gb ఇంటర్నెల్ స్టోరేజ్ తో ఫండింగ్ చేసిన వారకి ముందుగా 22,000 రూ లకు సెప్టెంబర్ 2016 నాటికి అందుబాటులోకి వస్తాయి.
అయితే ఇదే మొదటి సారి కాదు మాడ్యులర్ స్మార్ట్ ఫోన్ గురించి వినటం చూడటం.. గతంలో ఇంటర్నెట్ దిగ్గజం గూగల్ సైతం ప్రాజెక్ట్ అరా అనే పేరుతో ఇదే ఐడియాను స్టార్ట్ చేసింది. అయితే అది ఇంకా పూర్తి దశలోకి రాలేదు.