మైక్రో మాక్స్ కాన్వాస్ సేల్ఫీ 4 మోడల్ ను అనౌన్స్ చేసింది అఫీషియల్ గా. హాండ్ సెట్ ఈ నెల చివరిలో సేల్స్ స్టార్ట్ చేయనుంది.
హాండ్ సెట్ లో ప్రధాన హై లైట్ – 8MP ఫ్రంట్ కెమెరా అండ్ రేర్ కెమెరా. అంతేకాదు ఇది ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో os 6.0 వెర్షన్ తో వస్తుంది.
అలాగే మొదటి సారి, ఫోన్ వెనుక బాగంలో టాప్ సెన్సార్ అని వస్తుంది. దీని పై టాప్ చేసి కాల్స్ లిఫ్ట్ చేయటం అలాగే ఫోటోస్ క్లిక్ చేయటం చేయగలరు.
ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే దీనిలో.. 5 in HD డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ SoC, 1GB ర్యామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్.
32GB SD కార్డ్ సపోర్ట్, 3G ఇంటర్నెట్ కనెక్టివిటి, 2500 mah బ్యాటరీ ఉన్నాయి. అయితే కంపెని హాండ్ సెట్ ప్రైస్ ను ఇంకా తెలియజేయలేదు.