మిడ్ రేంజ్ ఫోన్ల ప్రత్యేకతల పోలిక : నోకియా 5.1 ప్లస్ vs రియల్ మి 2
నేడు, మనము నోకియా 5.1 ప్లస్ ని రియల్ మి 2 తో పోల్చి చూడనున్నాము. నోకియా 5.1 ప్లస్ ఇండియాలో 10,999 రూపాయల ధరకే ఉంది, ఇది రియల్ 2 కూడా అదే మధ్య శ్రేణి విభాగంలో ఉంది.
నోకియా 5.1 ప్లస్ గత నెలలో భారతదేశంలో నోకియా 6.1 ప్లస్ తోపాటుగా పరిచయం చేయబడింది. అక్టోబర్ 1 వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ స్మార్ట్ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి దీని ధర రూ .10,999 గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ రియల్ 2 యొక్క ప్రధాన పోటీదారుగా రూపుదిద్దుకుంది, ఈ రెండు కూడా మధ్య స్థాయి ఫోన్లు కాబట్టి లక్షణాల పరంగా ఎలా నిలుస్తాయనేది ఇక్కడ చూద్దాం.
Products |
||
Launch price |
||
Display |
5.86-inch |
6.2-inch |
Resolution |
720 x 1520 pixels |
720 x 1520 pixels |
Processor make |
MediaTek Helio P60 |
Qualcomm Snapdragon 450 |
Processor |
1.80GHz octa-core |
1.80GHz octa-core |
RAM |
3GB |
3GB |
Internal storage |
32GB |
32GB |
Expandable storage |
400GB |
256GB |
Rear camera |
13MP + 5MP |
13MP + 2MP |
Rear Flash |
Yes |
Yes |
Front camera |
8MP |
8MP |
Android version |
8.1 Oreo |
8.1 Oreo |
Sim slot |
Dual |
Dual |
మనము ఈ రెండు పరికరాలను పోల్చి చూడడానికి ముందుగా ఈ రెండు స్మార్ట్ ఫోన్ల ధరలను ఒకసారి పరిశీలిద్దాం.
రియల్ మి 2 : 4GB / 64GB – ధర రూ .10,990 మరియు 3GB / 32GB – ధర రూ .8,990
నోకియా 5.1 ప్లస్ : 3GB / 32GB – ధర రూ .10,990 .
ఇప్పుడు, ఈ రెండు పరికరాల డిస్ప్లే లను పోల్చి చూద్దాం : నోకియా 5.1 ప్లస్ ఒక 5.86-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, అయితే, రియల్ మి 2 యొక్క 6.2 అంగుళాల స్క్రీన్ పరిమాణంతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ రెండు పరికరాల రిజల్యూషన్ ఒకేలా ఉంటుంది, అది 720 x 1520 పిక్సెల్స్. ఇంకా, మీరు ఒక పెద్ద డిస్ప్లేతో ఒక స్మార్ట్ఫోన్ను కోరుకుంటే, అప్పుడు రియల్ మి 2 ను పరిశీలించవచ్చు.
వీటి పనితీరు విషయానికి వస్తే, ఈ నోకియా 5.1 ప్లస్ ఒక మీడియా టెక్ హీలియో P60 ఆక్టా – కోర్ ప్రాసెసర్ చేత శక్తిని కలిగి ఉంది, మరోవైపు రియల్ మి 2 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ఆక్టా – కోర్ ప్రాసెసర్ ద్వారా మద్దతు ఇస్తుంది. కెమెరా పరంగా, ఈ రెండు స్మార్ట్ఫోన్లు ముందు 8MP యూనిట్ కలిగి ఉంటాయి. అయితే, నోకియా 5.1 ప్లస్ వెనుక 13MP + 5MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది, ఇంక రియల్ మి 2 13MP + 2MP వెనుక కెమెరాతో అమర్చబడి ఉంటుంది.
కొనుగోలుదారులు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే నోకియా 5.1 ప్లస్ గూగుల్ యొక్క Android One కార్యక్రమంలో భాగం, దీనర్థం వారు Google ద్వారా అప్డేట్ విడుదల చేయబడిన వెంటనే ఈ అప్డేట్ లను పొందడానికి ఇది ముందంజలో ఉంటుంది.