మైక్రోసాఫ్ట్ రాబోవు మోడల్ 940 XL స్పెసిఫికేషన్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. గత కొంత కాలంగా దీనిపై అనెక్ రూమర్స్ వినిపించాయి.
నోకియా పవర్ యూజర్ రిపోర్ట్స్ ప్రకారం లుమియా 940 XL 5.7 in 1440 x 2560 పిక్సెల్స్, కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ డిస్ప్లే తో వస్తుంది. ఇది చాలా స్లిమ్ గా ఉండనుంది, మెటల్ ఫ్రేం బాడీ తో వస్తున్న 940 XL ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్ మరియు 3 జిబి ర్యామ్ ను అందిస్తుంది. 32 జిబి ఆన్ బోర్డ్ ఇంటర్నల్ మెమరి తో పాటు అదనపు స్టోరేజి కార్డ్ సదుపాయం ఉంది. 20 MP ప్యూర్ వ్యూ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా ఉన్నాయి. నేటివ్ పెన్ సపోర్ట్ తో వస్తున్న ఈ మోడల్ కి మైక్రోసాఫ్ట్ OneDrive 15జిబి ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ను ఇస్తుంది.
కనెక్టివిటి విషయంలో వైఫై, బ్లూటూత్ 4.0, NFC సపోర్ట్ తో పాటు టైప్ C రివర్సబల్ కనెక్టర్ తో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి తో పాటు ఐరిస్ Eye స్కానింగ్ టెక్నాలజీ ఇందులో ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. 3,300 mah బ్యాటరీ. మైక్రోసాఫ్ట్ మల్టీ విండో మరియు 3D యూజర్ ఇంటరెక్షన్ లాంటి కొన్ని ఎక్స్క్లూసివ్ విండోస్ 10 మొబైల్ ఫీచర్స్ ను కూడా జోడించే అవకాశాలు కూడా ఉన్నాయి.
5 in లుమియా 940 మోడల్ పై కూడా మైక్రోసాఫ్ట్ పనిచేస్తుంది. ఇది లుమియా 940 XL స్పెసిఫికేషన్స్ తోనే వస్తుంది. అయితే ఈ విండోస్ ఫోన్ స్పెసిఫికేషన్స్ పరంగా ఆండ్రాయిడ్ సామ్సంగ్ గేలక్సీ S6, HTC వన్ M9, సోని Z3+ మరియు LG G4 ఫ్లాగ్ షిప్స్ డివైజ్ లకు పోటీ ఇచ్చేలా ఉంది. అధికారికంగా మైక్రోసాఫ్ట్ ఈ ఫోన్ల గురించి మాట్లాడలేదు, కాని ఈ సంవత్సరం చివరి కల్లా విండోస్ 10 మొబైల్ ఫ్లాగ్ షిప్ డివైజ్ ను లాంచ్ చేయనున్నాము అని చెప్పింది. అలాగే మైక్రోసాఫ్ట్ జులై నెలలో విండోస్ 10 డెస్క్టాపు os ను విడుదల చేయనుంది. త్వరలోనే అది స్మార్ట్ ఫోన్ లకు కూడా రానుంది.
ఇది కాకుండా మైక్రోసాఫ్ట్ లుమియా 830 మోడల్ కు నెక్స్ట్ మోడల్, లుమియా 840 ను లాంచ్ చేసే ప్లాన్స్ లో ఉంది. దీనికి 13MP ప్యూర్ వ్యూ బ్యాక్ మరియు 5MP ఫ్రంట్ కెమేరా, 5 in డిస్ప్లే మరియు పవర్ ఫుల్ SoC ఉంటాయని మార్కెట్ అంచనాలు.
ఆధారం: NokiaPowerUser