విండోస్ 10 os తో కొత్త మొబైల్స్ : 950, 950 XL, 550
వీటితో పాటు ఇతర గాడ్జెట్ కూడా లాంచ్ అయ్యాయి.
నిన్న మైక్రోసాఫ్ట్ న్యూయార్క్ లో విండోస్ 10 లేటెస్ట్ os తో కొత్త మొబైల్స్ అండ్ ఇతర గాడ్జెట్స్ రిలీజ్ చేసింది. మొబైల్స్ పేరులు లూమియా 950, లూమియా 950 XL అండ్ లూమియా 550.
వీటిలో కొత్తగా ఉన్న ఫీచర్స్..
1. 950 అండ్ 950 XL లో టాబ్లెట్ క్లాస్ లిక్విడ్ కూలింగ్ ఉంది.
2. adaptive antenna టెక్నాలజీ. అంటే రెండు antennae లు ఉంటాయి.
3. triple RGB ఫ్లాష్ తో 20MP కెమేరా.
4. 5th gen ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషణ్ టెక్నాలజీ with dedicated కెమేరా బటన్.
5. 32gb ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 2TB sd కార్డ్ సపోరర్ట్.
6. USB టైప్ – C పోర్ట్. సెకెండ్ కు 5GB ట్రాన్సఫర్ అవుతుంది అని చెబుతుంది మైక్రోసాఫ్ట్. అలాగే 30 మినిట్స్ లో 50 % చార్జింగ్ కూడా ఎక్కుతుంది.
లూమియా 950 స్పెసిఫికేషన్స్ – 564 PPI తో 5.2 in OLED గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 808 ఆక్టో కోర్ ప్రొసెసర్, 3gb ర్యామ్, 20MP రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమేరా, 3000 mah బ్యాటరీ, 4G, విండోస్ 10 మొబైల్ os.
950 XL స్పెసిఫికేషన్స్ – 5.7 in OLED 518PPi గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే, hexa కోర్ స్నాప్ డ్రాగన్ 810 ప్రొసెసర్, 20MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమేరా, బ్లూటూత్ 4.1, FM రేడియో, 3340 mah బ్యాటరీ, 4G, విండోస్ 10 మొబైల్ os.
రెండు మోడల్స్ నవంబర్ లో అందుబాటులోకి వస్తున్నాయి. లూమియా 950 ప్రైస్ – 35,800 రూ. లూమియా 950 XL ప్రైస్ – 42,300 రూ. ఈ రెండింటింతో పాటు లూమియా 550 బడ్జెట్ ఫోన్ కూడా లాంచ్ అయ్యింది.
లూమియా 550 స్పెసిఫికేషన్స్ – 4.7 in 720 x 1280 పిక్సెల్స్ 315PPi డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 210 ఆక్టో కోర్ 1.1 GHz ప్రొసెసర్, అడ్రెనో 304, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 200 GB sd కార్డ్ సపోర్ట్.
5MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమెరా, 2MP ఫ్రంట్ కెమేరా, బ్లూటూత్ 4.1, 2100 mah బ్యాటరీ, 4G LTE, విండోస్ 10 మొబైల్ os.ఇది డిసెంబర్ లో available అవుతుంది. ప్రైస్ – సుమారు 9,000 రూ.